Ajaneesh Loknath : కాంతార సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విరుపాక్షకు పనిచేశారని మీకు తెలుసా??
కాంతార సినిమాకు అందరూ మెచ్చుకునేలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్. ఇప్పుడు అజనీష్ విరూపాక్ష సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Music Director Ajaneesh Loknath speech in Virupaksha pre Release Event
Ajaneesh Loknath : కన్నడలో చిన్న సినిమాగా రిలీజయి కాంతార భారీ విజయం సాధించింది. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా వరాహరూపం సాంగ్, సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మంచి పేరు వచ్చింది. కాంతార సినిమాకు అందరూ మెచ్చుకునేలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్. ఇప్పుడు అజనీష్ విరూపాక్ష సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే అజనీష్ విరూపాక్షకు పనిచేశారని తెలుసు. కానీ తాజాగా జరిగిన విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ అజనీష్ ని అందరికి పరిచయం చేశారు.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తో రికవర్ అయ్యాక ఇప్పుడు విరూపాక్ష(Virupaksha) సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవలే చిత్రయూనిట్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన విరూపాక్ష సినిమా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఏలూరులో విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Sukumar : సాయినే కాదు ఈ సినిమా డైరెక్టర్ కూడా చచ్చిపోయే స్థితిలోంచి బయటకి వచ్చి ఈ సినిమా చేశాడు..
విరూపాక్ష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ మాట్లాడుతూ.. ఒక భాషలో మ్యూజిక్ ఇవ్వాలంటే ఆ భాషని కూడా నేర్చుకోవాలి. ఈ సినిమా చేస్తున్నప్పుడు కొంచెం తెలుగు నేర్చుకున్నాను. మీరు ఇప్పటికే రెండు మెలోడీ సాంగ్స్ చూశారు. కానీ ఒక మాస్ డ్యాన్స్ సాంగ్ కూడా ఉంది. విరూపాక్ష అద్భుతమైన సినిమా. ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వమని నన్నుఅడిగినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను. డైరెక్టర్ కార్తీక్ ఈ సినిమా నాకు ఇచ్చిన్నందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమాని థియేటర్ లోనే చూడండి. ఈ సినిమాలో సౌండ్స్ కోసం చాలా కష్టపడ్డాం. యాక్షన్ సీన్స్ లో తేజ్ గారి కళ్ళల్లో ఫైర్ చూశాను. భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. కాంతార మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడని తెలియడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.