Music Director AR Rahman is facing severe criticism about Chennai floods
A R Rahman : అగ్ర సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన సంగీతంతో భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కర్ని అలరిస్తూ వస్తున్నారు. ఇటీవలే ఈ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించిన హిందీ మూవీ ‘పిప్పా’ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఇషాన్ ఖట్టర్, మృణాల్ ఠాగూర్, ప్రియాంషు బైన్యులి, లీసన్ కరిమోవా, సోనీ రుస్తాన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ మూవీలోని పలు సాంగ్స్ కూడా ఆడియన్స్ ఫేవరెట్ లిస్టులో స్థానం దక్కించుకున్నాయి.
తాజాగా ఈ మూవీలోని ‘మే పర్వానా’ అనే ఫుల్ వీడియో సాంగ్ ని ఏ ఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు. తన ‘ఎక్స్’ (X) అకౌంట్ ద్వారా ఈ వీడియో సాంగ్ ని రిలీజ్ చేస్తూ.. “రిథమ్‌ని ఎంజాయ్ చేయండి. డాన్స్ చేయడానికి ఈ రిథమ్‌ని మార్గదర్శకం చేసుకోండి” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజెన్స్ కి ఆగ్రహం కలిగిస్తుంది. ప్రస్తుతం చెన్నై నగరం మిగ్‌జామ్ తుపానుతో అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. వరదనీరు రోడ్డులు, ఇళ్లలోకి చొచ్చుకు రావడంతో సాధారణ ప్రజలతో పాటు కోలీవుడ్ సినీ సెలబ్రిటీస్ సైతం కష్టాలు ఎదుర్కొంటున్నారు.
Also read : The Girlfriend : గర్ల్‌ఫ్రెండ్‌గా మారిపోయిన రష్మిక.. షూటింగ్ షురూ చేసిన రాహుల్..
Embrace the rhythm and let the vibrant beats of #MainParwaana guide your dance. ??
Full Video: https://t.co/mYJrAGISqs@mrunal0801 @priyanshu29 @Soni_Razdan #IshaanKhatter @RajaMenon @RonnieScrewvala
#SiddharthRoyKapur #Shelle @arijitsingh #HiralViradia @tiwarii_pooja… pic.twitter.com/oMrWht4HhC— A.R.Rahman (@arrahman) December 4, 2023
వరదలు వల్ల కరెంటు పోవడం, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, ఇళ్లలోకి వరద నీరు కొట్టుకురావడంతో ఆహారం కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. చెన్నై ప్రజలంతా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి ట్వీటా చేసేది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలువురు తమిళ స్టార్స్ సహాయక చర్యలు కోసం తమ అభిమాన సంఘాలకు పిలుపునిస్తున్నారు. పలువురు హీరోలు సహాయం కోసం డొనేషన్స్ కూడా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో రెహమాన్ తన సినిమా సాంగ్ ప్రమోట్ చేయడం పై ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.