The Girlfriend : గర్ల్‌ఫ్రెండ్‌గా మారిపోయిన రష్మిక.. షూటింగ్ షురూ చేసిన రాహుల్..

రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్' రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో..

The Girlfriend : గర్ల్‌ఫ్రెండ్‌గా మారిపోయిన రష్మిక.. షూటింగ్ షురూ చేసిన రాహుల్..

Rashmika Mandanna Rahul Ravindran The Girlfriend regular shooting starts

Updated On : December 6, 2023 / 12:38 PM IST

The Girlfriend : రష్మిక మందన్న వరుస విజయాలు అందుకుంటూ దూసుకు పోతున్నారు. రీసెంట్ గా ‘యానిమల్’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన రష్మిక.. బిగ్గెస్ట్ హిట్టుని అందుకున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఒక పక్క థియేటర్స్ లో ఈ మూవీ జోష్ కొనసాగుతుండగానే రష్మిక తన కొత్త సినిమాని పట్టాలు ఎక్కేంచేశారు. టాలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రష్మిక ఓ సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ లాంచ్ అయ్యింది.

తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అనే టైటిల్ ని ఖరారు చేసుకున్న ఈ మూవీ హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన కథతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రేమ, ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే మేల్ లీడ్ లో ఎవరు నటిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ హేశం అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. గీత ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ పతాకం పై ఈ సినిమాని అల్లు అరవింద్, మారుతీ నిర్మిస్తున్నారు.

Also read : Animal Movie : యానిమల్‌లో ఆ సాంగ్ బిట్ కంపోజ్ చేసింది.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అని మీకు తెలుసా..?

 

View this post on Instagram

 

A post shared by Geetha Arts (@geethaarts)

చి.ల.సౌ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్‌ రవీంద్రన్‌.. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ ని అందుకున్నారు. రెండో చిత్రంగా నాగార్జునతో మన్మధుడు 2 తెరకెక్కించి ప్లాప్ ని అందుకున్నారు. మరి ఈ గర్ల్ ఫ్రెండ్ తో సక్సెస్ అందుకుంటారో లేదో చూడాలి. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే.. ఈ మూవీతో పాటు ‘రెయిన్ బో’ అనే మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. పుష్ప 2లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.