Kiran Abbavaram : పాలు తాగే వయసులోనే మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.. ఎమోషనల్ అయిన కిరణ్ అబ్బవరం..

My mother left me at the age of drinking milk Kiran Abbavaram emotional
Kiran Abbavaram :యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘ క ‘ సినిమా రేపు విడుదలై థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ యంగ్ హీరో నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు. నిన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేసారు. దీనికి గెస్ట్ లుగా అక్కినేని నాగ చైతన్య వచ్చాడు. అలాగే కిరణ్ సబ్బవరం భార్య రహస్య కూడా వచ్చింది.
అయితే ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం తన జీవితంలో జరిగిన పలు విషయాలను పంచుకున్నారు. అలా ఆయన మాట్లాడుతూ.. “మా అమ్మ పల్లెటూళ్లో పుట్టి పెరిగి మా కోసం కూలి పనులు చేసింది. కేవలం మమ్మల్ని ఇంగ్లిష్ మీడియంలో చదివించడం కోసం ‘కువైట్’ వెళ్ళిపోయింది. 20 ఏళ్లలో నేను మా అమ్మ దగ్గర ఓ రెండు సంవత్సరాలు ఉన్నానేమో అంతే అంటూ ఎమోషనల్ అయ్యారు.
Also Read : SSMB29 : మహేష్ బాబు కోసం రంగంలోకి దిగిన జక్కన్న.. లొకేషన్స్ కోసం వేట షురూ..
పాలు తాగే వయసులోనే మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఎన్నో కష్టాలు అనుభవిస్తూ కువైట్ లోనే ఉండిపోయింది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కట్టిన ఇల్లు కూడా మా కోసమే అమ్మేయాల్సి వచ్చింది. మా అమ్మ 5వ తరగతి వరకే చదువుకుంది. పెద్దగా చదువుకోకపోయినా వేరే దేశం వరకు వెళ్ళింది. అలాంటి నేను ఇంకెన్ని సాదించాలి. ఆ పట్టుదల తోనే ఇక్కడివరకు వచ్చానని ఎమోషనల్ అయ్యారు కిరణ్ అబ్బవరం.