Mythri Movie Makers : బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మైత్రి మూవీ మేకర్స్.. సల్మాన్ ఖాన్‌తో కలిసి..

మైత్రి మూవీ మేకర్స్. వరుస సినిమాలతో, వరుస హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలిసి.

Mythri Movie Makers : బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మైత్రి మూవీ మేకర్స్.. సల్మాన్ ఖాన్‌తో కలిసి..

Mythri Movie Makers entry in Bollywood Along with Salman Khan Films with Farrey Movie

Mythri Movie Makers : ఇప్పుడు టాలీవుడ్(Tollywood) అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ ఒకటి. శ్రీమంతుడు సినిమాతో మొదలుపెట్టి ఇప్పుడు పుష్ప వరకు అన్ని భారీ సినిమాలు నిర్మించి భారీ విజయాలు సాధించింది మైత్రి మూవీ మేకర్స్. వరుస సినిమాలతో, వరుస హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలిసి.

సల్మాన్ ఖాన్(Salman Khan) ఫిలిమ్స్, మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్థ కలిసి బాలీవుడ్(Bollywood) లో ‘ఫర్రి’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. థాయిలాండ్ కి చెందిన ‘బ్యాడ్ జీనియస్’ అనే సినిమాకు ఇది రీమేక్ అని సమాచారం. తాజాగా ఫర్రి ట్రైలర్ కూడా రిలిజ్ చేశారు. కొంతమంది స్మార్ట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో ఎలా కాపీ కొడతారు, అలాంటి వాళ్ళని ఎలా పట్టుకున్నారు, వాళ్ళ లైఫ్ ఏమైంది అనే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

Also Read : Vijay Devarakonda – Rashmika : ముచ్చటగా మూడోసారి విజయ్ – రష్మిక జంటగా? శ్రీలీల ప్లేస్‌లో రష్మిక?

ఫర్రీ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ కేవలం నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. లేదా ఇందులో గెస్ట్ రోల్ ఏమైనా చేశారో చూడాలి. సల్మాన్ తో కలిసి ఓ సినిమాని బాలీవుడ్ లో మైత్రి మేకర్స్ నిర్మిస్తుండటంతో వీరికి అభినందనలు తెలుపుతున్నారు టాలీవుడ్ ప్రముఖులు. అలాగే ప్రభాస్ – సిద్ధార్థ్ ఆనంద్ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని సమాచారం.