Site icon 10TV Telugu

Game Changer : ‘నానా హైరానా’ పాట ఎక్క‌డ‌..? మూవీలో లేని సాంగ్.. టీమ్ ఏమ‌న్న‌దంటే..?

Naanaa Hyraanaa song remove from Game Changer movie due to technical challenges

Naanaa Hyraanaa song remove from Game Changer movie due to technical challenges

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి ఈ మూవీకి మంచి స్పంద‌న వ‌స్తోంది. అయితే.. మెలోడి సాంగ్ నానా హైరానా పాట‌ను థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించ‌లేదు. దీంతో ఈ పాట కోసం ఎంతో ఎదురుచూసిన ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. దీంతో ఈ సాంగ్ ఎందుక‌ని సినిమాలో లేదు అన్నది ఆరా తీస్తున్నారు.

కాగా.. చిత్ర బృందం ఈ ఉద‌య‌మే దీనిపై స్పందించింది. కొన్ని సాంకేతిక సమస్యల కార‌ణంగా ఈ పాట‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ‘ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీక‌రించిన తొలి భార‌తీయ పాట ఇది. సినిమా ప్రింట్‌లో అప్‌లోడ్ చేసే స‌మ‌యంలో కొన్ని సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదురు అయ్యాయి. ఈ కార‌ణంగానే పాట‌ను ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయాం. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తున్నాం. జ‌న‌వ‌రి 14 నుంచి నానా హైరానా పాట‌ను సినిమాలో జోడిస్తాం.’ అని టీమ్ తెలిపింది.

Game Changer Movie Review : ‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ.. శంకర్, చరణ్ కాంబో వర్కౌట్ అయిందా?

నానా హైరానా పాట‌కు రామ‌జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించ‌గా కార్తీక్‌, శ్రేయా ఘోష‌ల్ లు పాడారు. త‌మ‌న్ సంగీతాన్ని అందించ‌గా బోస్కో మార్టిస్ కొరియోగ్ర‌ఫీ చేశారు. ఈ పాట‌ను న్యూజిలాండ్‌లో ఆరు రోజుల పాటు చిత్రీక‌రించారు. ఈ ఒక్క పాట కోస‌మే దాదాపు రూ.10 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. కాగా.. నానా హైరానా సాంగ్ విడుద‌ల చేసిన‌ప్ప‌టి నుంచి యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలోని పాట‌ల‌కు రూ.75 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది.

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన గేమ్ ఛేంజ‌ర్ మూవీలో కియారా అద్వానీ క‌థానాయిక‌. అంజ‌లి, ఎస్‌జే సూర్య‌, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్ చంద్ర, రాజీవ్ కనకాల కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Pushpa 2 : చైనా రిలీజ్ కి రెడీ అవుతున్న పుష్ప 2..? దంగల్ రికార్డ్ బద్దలు కొట్టడానికే..

Exit mobile version