నరేష్ నట విశ్వరూపం ‘నాంది’..

నరేష్ నట విశ్వరూపం ‘నాంది’..

Updated On : February 6, 2021 / 12:55 PM IST

Naandhi: ‘అల్లరి’ నరేష్‌.. ఇన్నాళ్లు తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఇప్పుడు తనలోని నటుణ్ణి బయటకు తీసే విభిన్నమైన పాత్రలతో విలక్షణ నటుడిగా నిరూపించుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ‘మహర్షి’ లో రవి గా ఆకట్టుకున్న నరేష్ కొంత గ్యాప్ తర్వాత తనకున్న కామెడీ ఇమేజ్‌ని పక్కన పెట్టేసి ‘నాంది’ అనే ఓ ఢిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన నరేష్ పోస్టర్స్, టీజర్ కొత్తదనంతో ఆకట్టుకున్నాయి.

శనివారం సూపర్‌స్టార్ మహేష్ బాబు ‘నాంది’ ట్రైలర్ రిలీజ్ చేశారు. చెయ్యని శిక్షకి బలై, ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోయే ఖైదీ సూర్య ప్రకాష్ గా నరేష్ కనిపించాడు. అతని తరపున వాదించే లాయర్ గా వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. ఆద్యంతం సీరియస్‌గా సాగిన ట్రైలర్‌లో నరేష్ నటన, హావభావాలతో ఆకట్టుకున్నాడు. అబ్బూరి రవి మాటలు ఆకట్టుకుంటున్నాయి.

ప్రియదర్శి, ప్రవీణ్, హరీష్ ఉత్తమన్, దేవి ప్రసాద్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ఎస్.వి. 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న నిర్మిస్తున్న ‘నాంది’ ఫిబ్రవరి 19న రిలీజ్ కానుంది.