MAA Elections: విష్ణూకి సపోర్ట్.. ‘మా’ అసోసియేషన్‌పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలు రెండేళ్లకోసారి జరిగినా కూడా సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తగ్గకుండా హీట్ పుట్టిస్తూ ఉట్టుంది.

Nbk

Nadamuri Balakrishna Sensational Comments on MAA Association: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సంఘం అధ్యక్ష ఎన్నికలు రెండేళ్లకోసారి జరిగినా కూడా సాధారణ ఎన్నికలకు ఏ మాత్రం తగ్గకుండా హీట్ పుట్టిస్తూ ఉట్టుంది. ఈసారి కూడా అధ్యక్ష పోటీకి బలమైన అభ్యర్థులే రంగంలోకి దిగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు పోటీ చేయాలని నిర్ణయించుకోగా.. జీవితా రాజశేఖర్, నటి హేమ కూడా బరిలో దిగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మురళీమోహన్ జోక్యం చేసుకుని ఎన్నికలను ఏకగ్రీవం చేస్తామని చెప్పగా సమస్య తగ్గినట్లుగా కనిపించింది.

ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు అగ్రహీరో నందమూరి బాలకృష్ణ. సమస్య అంతా మా అసోసియేషన్ సొంత భవనం గురించేనని, ఇన్నేళ్లయినా ఎందుకు కట్టలేకపోయారంటూ ప్రశ్నించారు బాలయ్య. నటీనటులంతా కలిస్తే ఇంద్రభవనం కట్టవచ్చని అన్నారు బాలయ్య. ఫస్ట్ క్లాస్ ఫ్లైట్‌లలో ఫండ్ రైజింగ్ కోసం అమెరికా వెళ్లి తీసుకుని వచ్చిన డబ్బంతా ఏమి చేశారంటూ నిలదీశారు బాలయ్య.

తెలంగాణా సర్కారుతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. మా భవనం కోసం ఒక ఎకరం అడిగితే ఇవ్వరా..?? అని ప్రశ్నించారు. మంచు విష్ణు బిల్డింగ్ నిర్మాణంలో ముందుకొస్తే నేను కూడా మంచు విష్ణూకి సపోర్ట్ చేస్తా.. మా ఎలక్షన్స్‌లో లోకల్ నాన్ లోకల్ అనేది నేను పట్టించుకోను అని అన్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న నటులు అందరూ బహిరంగంగా చర్చించుకోవడం సరికాదని అన్నారు. అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులంతా సమానమేనని అన్నారు. ఇండస్ట్రీ పెద్దలంతా బిల్డింగ్ కోసం పాటుపడాల, బిల్డింగ్‌ కట్టే విషయంలో విష్ణు ముందు నేనుంటానని అన్నారు.