Kalki 2898 AD : ‘కల్కి 2898 AD’ రిలీజ్ తర్వాత యానిమేటెడ్ వర్షన్ సినిమా కూడా?
కామిక్ కాన్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలని తెలిపారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ....

Nag Ashwin says Prabhas Kalki 2898 AD Movie will release in Comic Version also
Kalki 2898 AD : ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్ పై దాదాపు 500 కోట్లతో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ఇటీవలే ఈ సినిమాకు ‘కల్కి 2898 AD’ అనే టైటిల్ ని ప్రకటించారు. హాలీవుడ్ లో జరిగే ప్రతిష్టాత్మక కామిక్ కాన్ ఈవెంట్ లో కల్కి చిత్రయూనిట్ అంతా వెళ్లి సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ హాలీవుడ్ రేంజ్ ని మించి ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘కల్కి 2898 AD’ సినిమాలో దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్, దిశా పటాని.. ఇలా చాలా మంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. గ్లింప్స్ రిలీజ్ తో సినిమా రేంజ్ పెరిగిపోయింది. అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఈ హాలీవుడ్ రేంజ్ ఇండియన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక కామిక్ కాన్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలని తెలిపారు.
తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కల్కి 2898 AD’ సీక్వెల్ ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి సీక్వెల్ ఆలోచన లేదు కానీ ఈ సినిమాకు యానిమేటెడ్ వర్షన్ తయారు చేయాలని అనుకుంటున్నాము. ఈ సినిమాలోని పాత్రలు, ప్రాంతాలు, వాహనాలతో ఓ సరికొత్త ప్రపంచం సృస్టిస్తున్నాం. ఆ ప్రపంచాన్ని కామిక్ వర్షన్ లో కూడా చూపించాలని అనుకుంటున్నాను. కల్కి సినిమా రిలిజ్ తర్వాతే ఆ కామిక్ వర్షన్ ఉండొచ్చు అని తెలిపారు.
Nagarjuna : శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో నాగార్జున గెస్ట్ అప్పీరెన్స్?
కామిక్ సినిమాలంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. బయటి దేశాల్లో అయితే కామిక్ సినిమాలకు చాలా డిమాండ్ ఉంటుంది. దీంతో హాలీవుడ్ ని టార్గెట్ పెట్టుకొని కల్కి యానిమేటెడ్ వర్షన్ ని తెరకెక్కిస్తారని భావిస్తున్నారు. దీంతో ఇండియా నుంచి ఓ భారీ యానిమేటెడ్ సినిమా వస్తుంది అని సంతోషిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రభాస్ అభిమానులు అయితే ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.