Naga Chaitanya – samantha : మొన్న సమంత.. ఇప్పుడు నాగచైతన్య.. పిల్లలు కావాలి అంటూ కామెంట్స్..

నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఈ ఇద్దరూ ఇప్పుడు ఇలా పిల్లలు కావాలి అనడం గమనార్హం.

Naga Chaitanya and Samantha Comments on Childrens

Naga Chaitanya – samantha : ఇటీవల సమంత సిటాడెల్ ప్రమోషన్స్ లో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను తల్లి కావాలని కలలు కన్నాను. మాతృత్వం ఒక అందమైన అనుభూతి. మాతృత్వానికి వయసుతో సంబంధం లేదు. నాకు పిల్లలు కావాలి అని అంది. అయితే తాజాగా నాగచైతన్య కూడా ఇలాంటి కామెంట్స్ చేసాడు.

రానా హోస్ట్ గా ది రానా దగ్గుబాటి షో అనే టాక్ షో అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 23 నుంచి రానుంది. ఇటీవల దానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ షోకు నాగచైతన్య కూడా గెస్ట్ గా వచ్చాడు. అయితే నాగచైతన్యను రానా ఫ్యామిలీ ప్లానింగ్ గురించి అడగ్గా.. హ్యాపీగా పెళ్లి చేసుకొని కొంతమంది పిల్లలు ఉంటే బాగుంటుంది అని అన్నాడు. అయితే వెంకీ మామలాగా నలుగురు పిల్లలు మాత్రం వద్దు అని సరదాగా అన్నాడు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

Also Read : Allu Arjun – Balakrishna : బాలయ్య – అల్లు అర్జున్ అన్‌స్టాప‌బుల్ షో పార్ట్ 2 గ్లింప్స్ రిలీజ్.. బన్నీ పిల్లల సందడి..

నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత ఈ ఇద్దరూ ఇప్పుడు ఇలా పిల్లలు కావాలి అనడం గమనార్హం. ఇక నాగ చైతన్య త్వరలోనే శోభితను పెళ్లి చేసుకోనున్నాడు.