Naga Chaitanya and Samantha post on 13 years for Ye Maaya Chesave
Chaitanya – Samantha : టాలీవుడ్ యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కిన రెండో సినిమా ‘ఏ మాయ చేసావె’. ఈ చిత్రంతోనే స్టార్ హీరోయిన్ సమంత తన సినీ కెరీర్ ని స్టార్ట్ చేసింది. 2010 లో వచ్చిన ఈ సినిమాని గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్ట్ చేశాడు. మహేష్ బాబు అక్క మంజుల దేవి ఈ చిత్రాన్ని నిర్మించింది. లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో నాగచైతన్య, సమంత మధ్య కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంది. డైరెక్టర్ అవుదాం అనుకుంటున్న కార్తీక్ (నాగచైతన్య) అనే కుర్రాడికి.. తనకంటే వయసులో పెద్దది అయిన జెస్సి (సమంత) ఎదురు అవ్వడం, కార్తీక్ మొదటి చూపులోనే జెస్సితో ప్రేమలో పడిపోవడం, ఆ తరువాత వారిద్దరి మధ్య ప్రేమ సంభాషణలను దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన తీరు ప్రతి ఒకర్ని ఫీల్ అయ్యేలా చేసింది.
Custody : కస్టడీ నుంచి రిలీజ్ అయిన నాగచైతన్య..
ఇక జెస్సి క్యారెక్టర్ తో సమంత కుర్రాళ్లకు డ్రీం గర్ల్ అయ్యిపోయింది. ఇప్పటికే జెస్సి పాత్రకి కుర్రాళ్ల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఎ ఆర్ రెహమాన్ సంగీతం. ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ అల్ టైం ఫేవరెట్. కాగా ఈ మూవీ రిలీజ్ అయ్యి నేటితో (ఫిబ్రవరి 26) 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దీంతో నాగచైతన్య, సమంత తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ఏ మాయ చేసావె’ గురించి పోస్ట్ లు వేశారు. ఈ క్రమంలోనే నాగచైతన్య తన స్టోరీలో సమంతతో ఉన్న మూవీ పోస్టర్ ని షేర్ చేశాడు. కానీ సమంత మాత్రం నాగచైతన్య ఉన్న పోస్టర్ కాకుండా జెస్సి పోస్టర్లు మాత్రమే షేర్ చేసింది.
Samantha: హార్స్ రైడింగ్ చేస్తోన్న సమంత.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో!
ఇక్కడ మరో విషయం ఏంటంటే.. నాగచైతన్య షేర్ చేసిన ఫొటోలో పై భాగంలో సమంతతో కలిసి ఉంటే, కింద భాగంలో ఒంటరిగా ఉన్న ఫోటో ఉంది. ఇక ఈ ఫోటో చూసిన కొందరు నెటిజెన్లు.. 13 ఏళ్ళ క్రిందట సమంత ఉంది, కానీ ఇప్పుడు లేదు అని గుర్తు చేసుకుంటూ నాగచైతన్య పోస్ట్ వేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత ఇండస్ట్రీకి వచ్చి కూడా 13 ఏళ్ళు పూర్తి అవ్వడంతో ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.
Naga Chaitanya and Samantha post on 13 years for Ye Maaya Chesave
Naga Chaitanya and Samantha post on 13 years for Ye Maaya Chesave