Custody : కస్టడీ నుంచి రిలీజ్ అయిన నాగచైతన్య..

యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. గత ఏడాది సెప్టెంబర్ లో మొదలైన ఈ మూవీ, జనవరి మొదటి వారంలో చివరి షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరుపుకున్న చిత్ర యూనిట్..

Custody : కస్టడీ నుంచి రిలీజ్ అయిన నాగచైతన్య..

Custody

Custody : యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. ఈ మూవీతో మరోసారి మాస్ హీరోగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. చైతన్య కెరీర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి మాస్ హీరోగా ప్రేక్షకుల ముందు వచ్చిన ప్రతిసారి ఆకట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మరోసారి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు పై భారం వేసి ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. వెంకట్ ప్రభు గత చిత్రం ‘మానాడు’ సినిమా తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో ఈ సినిమా పై చై అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

Custody Movie Song : చైతూ, కృతి.. ఒక్క పాట కోసం ఏడు భారీ సెట్స్..

పోలీస్ కథాంశంతో వస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా తెరకెక్కుతుంది. గత ఏడాది సెప్టెంబర్ లో మొదలైన ఈ మూవీ, జనవరి మొదటి వారంలో చివరి షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరుపుకున్న చిత్ర యూనిట్.. నేటితో (ఫిబ్రవరి 24) నాగచైతన్య ని కస్టడీ నుంచి రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేసింది. మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొడుతున్నట్లు తెలియజేస్తూ ఒక వీడియో ని రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రాన్ని మే 12న కచ్చితంగా రిలీజ్ చేస్తున్నట్లు తెలియజేశారు. త్వరలోనే మూవీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టనున్నారు.

ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించింది. బంగార్రాజు సినిమాతో వీరిద్దరూ హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఇక ఈ చిత్రానికి ఇద్దరు అగ్ర సంగీత దర్శకులు పని చేస్తుండడం విశేషం. మాస్ట్రో ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. మరి నాగచైతన్య ఈసారి మాస్ కమర్షియల్ హిట్టుని అందుకుంటాడా? లేదా? చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)