Naga Chaitanya: తమిళ దర్శకుడితో చైతూ ద్విభాషా చిత్రం?

మన తెలుగు హీరోలు ఇప్పుడు నేషనల్ వైడ్ మార్కెట్ పెంచుకొనే పనిలో ఉన్నారు. పొరుగు రాష్ట్రాల దర్శకులు కూడా మన హీరోలు ఒక్క..

Naga Chaitanya: తమిళ దర్శకుడితో చైతూ ద్విభాషా చిత్రం?

Naga Chaitanya

Updated On : January 29, 2022 / 7:53 PM IST

Naga Chaitanya: మన తెలుగు హీరోలు ఇప్పుడు నేషనల్ వైడ్ మార్కెట్ పెంచుకొనే పనిలో ఉన్నారు. పొరుగు రాష్ట్రాల దర్శకులు కూడా మన హీరోలు ఒక్క అవకాశం ఇస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ అయ్యే ప్రయత్నాల్లో ఉంటే.. ఆ తర్వాత హీరోలు నానీ, రామ్, నాగ చైతన్య లాంటి హీరోలు దక్షణాదిలో పాగా వేసేందుకు ట్రై చేస్తున్నారు.

Telugu Dubbing Movies: నేషనల్ వైడ్ తెలుగు సినిమా డబ్బింగ్ మేళా

నానీ ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ సినిమాతో దక్షణాది స్టార్ గా మారగా.. రామ్ సౌత్ సినిమాగా తమిళ దర్శకుడు లింగుస్వామితో జతకట్టి ది వారియర్ తో రాబోతున్నాడు. ఇప్పుడు అదే బాటలో నాగ చైతన్య కూడా ఓ తమిళ దర్శకుడితో బైలింగ్వల్ సినిమా చేసేందుకు సిద్దమయ్యాడట. కోలీవుడ్ లో విలక్షణ దర్శకుడిగా వెంకట్ ప్రభుకి మంచి పేరుంది. ‘గోవా’ ‘సరోజ’ ‘గ్యాబ్లింగ్’ ‘రాక్షసుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు వెంకట్ పరిచయమే.

Neha Sharma: అందాలతో సెగలు రేపుతున్న నేహా!

తాజాగా శింబు హీరోగా తెరకెక్కించిన టైం లూప్ కాన్సెప్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మానాడు’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా.. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకుంది. కాగా.. వెంకట్ ప్రభు దర్శకత్వంలోనే నాగ చైతన్య హీరోగా ఓ సినిమా చర్చలు జరుగుతున్నాయట. వెంకట్ ప్రభు చాలాకాలంగా తెలుగులో సినిమా కోసం ప్రయత్నిస్తుండగా.. చైతూ కూడా తమిళంలో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఈ ఇద్దరూ కలిసి ద్విభాషా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది.