Custody Movie: ‘కస్టడీ’ టీజర్‌కు అదిరిపోయిన రెస్పాన్స్.. ఏకంగా 15 మిలియన్ వ్యూస్!
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా, పూర్తి పోలీస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పనులు ముగించేసుకున్న కస్టడీ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది.

Naga Chaitanya Custody Movie Teaser Gets Massive Response
Custody Movie: అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా, పూర్తి పోలీస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఇప్పటికే షూటింగ్ పనులు ముగించేసుకున్న కస్టడీ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది.
Custody Movie: నాగచైతన్య కస్టడీ టీజర్ వచ్చేది అప్పుడే!
ఈ టీజర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేసింది చిత్ర యూనిట్. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే ఈ టీజర్‌కు యూట్యూబ్‌లో అదిరిపోయే వ్యూస్ దక్కుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో కలిపి కస్టడీ టీజర్‌కు ఏకంగా 15 మిలియన్ వ్యూస్ దక్కినట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఇలా చైతూ కస్టడీ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
Custody Movie: ‘కస్టడీ’ డబ్బింగ్ మొదలుపెట్టిన నాగచైతన్య
కాగా, ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో నాగచైతన్య నటిస్తుండగా, అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
#CustodyTeaser pic.twitter.com/GN2FDNj3Ug
— chaitanya akkineni (@chay_akkineni) March 18, 2023