Naga Chaitanya heavy workouts for NC23 movie
Naga Chaitanya : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య.. తన 23వ సినిమాని గీతాఆర్ట్స్ లో బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. 2018లో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పక్కా ప్లానింగ్ తో జరుగుతున్నాయి. ఇక ఈ మూవీ కోసం నాగచైతన్య చాలా కష్టపడుతున్నాడు. ఈ మూవీలోని తన పాత్ర కోసం ఎంతో హోమ్ వర్క్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో చైతన్య మత్స్యకారుడుగా నటిస్తున్నాడు.
ఇందుకోసం ఎచ్చెర్ల మండలం కె మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులతో కలిసి ఒక రోజు సముద్రానికి చేపల వేటకు కూడా వెళ్ళాడు. నటనలో మరిన్ని మెళుకువలు నేర్చుకోవడానికి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక బాడీ పరంగా కూడా దృడంగా కనిపించడానికి కండల పెంచుతున్నాడు. జిమ్ లో తెగ వర్క్ అవుట్స్ చేస్తున్నాడు. నరాలు కనిపించేలా కండలు పెంచుతున్నాడు. చైతన్య వర్క్ ఔట్స్ చూస్తుంటే.. ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ చూపించేలా ఉన్నాడు. చైతన్య ఇప్పటి వరకు బాడీ చూపిస్తూ ఫైట్ చేసిన సినిమాలు లేవు.
Also read : Eagle Teaser : ఈగల్ టీజర్ అప్డేట్ ఇచ్చిన రవితేజ.. సిద్ధంకండి రావణ ఫ్యాన్స్..
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 2018లో గుజరాత్ విరావల్ నుండి 21 మంది మత్స్యకారులు వేటకెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ చెరలో చిక్కుకున్నారు. వారిలో ఎచ్చెర్ల మండలం కె మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడి కథని తీసుకోని దాని చుట్టూ ఒక అందమైన కథని అల్లుకొని దర్శకుడు ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి.