Eagle Teaser : ఈగల్ టీజర్ అప్డేట్ ఇచ్చిన రవితేజ.. సిద్ధంకండి రావణ ఫ్యాన్స్..

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఈగల్ మూవీ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..?

Eagle Teaser : ఈగల్ టీజర్ అప్డేట్ ఇచ్చిన రవితేజ.. సిద్ధంకండి రావణ ఫ్యాన్స్..

Raviteja gave his new movie Eagle Teaser update

Updated On : November 5, 2023 / 2:46 PM IST

Eagle Teaser : మాస్ మహారాజ్ రవితేజ ఈ దసరాకి ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది. ఇక ఇప్పుడు రవితేజ తన తదుపరి సినిమాల పై ఫోకస్ పెట్టాడు. ఇటీవలే గోపీచంద్ మలినేనితో చేయాల్సిన RT4GM చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో పట్టాలు ఎక్కించాడు. ఇక సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ‘ఈగల్’ మూవీ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టడానికి సిద్దమయ్యాడు.

ఈక్రమంలోనే ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. గతంలో ఈ సినిమా అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ఒక వీడియో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఆ వీడియో చూసిన తరువాత.. సినిమా సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుందని అర్థమైంది. మరి ఇప్పుడు ఈ టీజర్ తో మూవీ పై ఎలాంటి హైప్ ని క్రియేట్ చేస్తారో చూడాలి. కాగా ఈ సినిమాని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్నాడు. కార్తికేయ 2 తో పాటు రవితేజ సినిమాలు ధమాకా, డిస్కో రాజా చిత్రాలకు కూడా కార్తీక్ డిఒపిగా చేశాడు.

Also read : Shah Rukh Khan : ఫ్యాన్స్ తో షారుఖ్ స్పెషల్ మీట్.. షారుఖ్ బర్త్ డే, ‘డంకీ’ టీజర్ సెలబ్రేషన్..

ఇక ఈ సినిమాలో రవితేజకి జంటగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవదీప్, వినయ్ రాయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.