Naga Chaitanya : శోభితకు నాగచైతన్య పెట్టిన కండిషన్ ఏంటో తెలుసా? రెగ్యులర్ గా ఆ విషయంలో చైతు రిక్వెస్ట్..
చైతు ఓ విషయంలో శోభితను రెగ్యులర్ గా రిక్వెస్ట్ చేస్తాడంట.

Naga Chaitanya Request to Sobhita Dhulipala
Naga Chaitanya – Sobhita : నాగచైతన్య – శోభిత ఇటీవల డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కొత్తజంట తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ గురించి బోలెడన్ని విషయాలు పంచుకున్నారు. అయితే చైతు ఓ విషయంలో శోభితను రెగ్యులర్ గా రిక్వెస్ట్ చేస్తాడంట.
నాగచైతన్య తెలుగు వాడైనా పుట్టి పెరిగిందంతా చెన్నైలో కావడం, చదివింది ఇంగ్లీష్ మీడియం కావడంతో ఎక్కువగా తమిళ్, ఇంగ్లీష్ వచ్చంట. తెలుగులో మాట్లాడగలిగినా అంత పూర్తిగా, సరళంగా మాట్లాడలేడట. సినీ పరిశ్రమలో వివిధ భాషలకు చెందిన నటీనటులను కలుస్తుండటంతో తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసే మాట్లాడేవాడట. దీంతో తెలుగు మాట్లాడే వాళ్లకు తనకు ఇష్టమని తెలిపాడు.
అలా శోభిత పరిచయం అయ్యాక తెలుగమ్మాయి కావడంతో తనతో తెలుగులోనే మాట్లాడాలని కండిషన్ పెట్టాడట. రెగ్యులర్ గా తనతో తెలుగులోనే మాట్లాడమని శోభితను అడిగేవాడిని అని, దానివల్ల నాగచైతన్యకు తన తెలుగు ఇంకా మెరుగుపడుతుంది అని భావిస్తున్నట్టు నాగచైతన్య తెలిపాడు.