Naga Chaitanya Sai Pallavi Thandel Success Party Bandhavi Sridhar Photos goes Viral
Bandhavi Sridhar : నాగ చైతన్యు, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమా ఇటీవల ఫిబ్రవరి 7న రిలీజయి భారీ విజయం సాధించింది. తండేల్ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి చైతూ కెరీర్లో మొదటి 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఇటీవల నిర్మాతలు తండేల్ సక్సెస్ పార్టీ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ పార్టీకి సినీ పరిశ్రమలోని హీరోలు, హీరోయిన్స్, నిర్మాతలు.. ఇలా చాలా మంది ప్రముఖులు వచ్చారు.
ఈ సక్సెస్ పార్టీ కి చెందిన ఫోటోలు బయటకు రాగా ఇందులో వైట్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి తెగ వైరల్ అవుతుంది. నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, డిఎస్పీతో ఈ అమ్మాయి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో తండేల్ పార్టీలో తళుక్కుమని మెరిసిన ఈ అమ్మాయి ఎవరో అని తెగ వెతుకుతున్నారు. బాంధవి కూడా తండేల్ పార్టీలో సెలబ్రిటీలతో దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తండేల్ పార్టీలో వైట్ డ్రెస్ లో మెరిపించి సెలబ్రిటీలతో ఫోటోలు దిగిన ఈ అమ్మాయి ఎవరో కాదు… సూపర్ హిట్ హారర్ సినిమా మసూదలో సంగీత కూతురి పాత్రలో నటించి, దయ్యం పట్టినట్టు నటించి అందర్నీ భయపెట్టిన నటి బాంధవి శ్రీధర్. మసూద సినిమాతో ఈ అమ్మాయికి మంచి పేరు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం రావట్లేదు. సినిమాలో దయ్యం పట్టినట్టు నటించినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది బాంధవి.
బాంధవి మిస్ ఇండియా రన్నరప్, మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్, మిస్ ఆంధ్రపదేశ్2019 పెజెంట్స్ కూడా గెలుచుకుంది. ఈమె మంచి ఫిట్నెస్ ఫ్రీక్ కూడా రెగ్యులర్ గా తన వర్కౌట్స్, బాడీ ఫిట్నెస్ చూపిస్తూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. గతంలో పలు సినిమాల్లో నటించినా అంత గుర్తింపు రాలేదు. మసూదతో ఫేమ్ వచ్చినా ఇప్పుడు అవకాశాలు రావట్లేదు.
అయితే ఈ అమ్మాయి తండేల్ సక్సెస్ పార్టీకి ఎందుకు వచ్చింది, సినిమాలో ఏదైనా చిన్న పాత్రలో నటించిందా, లేక ఎవరైనా నిర్మాణ సంస్థలో బాగా తెలిసినవాళ్ళు పిలిచారా, లేదా ఆ నిర్మాణ సంస్థలో ఏదైనా నెక్స్ట్ సినిమా చేస్తుందా అని సందేహం వ్యక్తపరుస్తున్నారు. మసూద తర్వాత సోషల్ మీడియాలో తప్ప బయట ఎక్కువగా కనపడని బాంధవి ఈ తండేల్ పార్టీలో చైతూ, తేజ్ తో ఫోటోలు దిగి, వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా మెరిపించడంతో వైరల్ అవుతుంది. మరి ఇప్పటికైనా ఈమె అందానికి హీరోయిన్ ఛాన్సులు, కీ రోల్స్ లాంటివి వస్తాయేమో చూడాలి.