Roja – Srikanth : రోజా రీ ఎంట్రీ.. సరదా కౌంటర్ ఇచ్చిన శ్రీకాంత్.. ‘సంక్రాంతి వస్తున్నాం’ సీన్ రీ క్రియేట్.. ప్రోమో వైరల్..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీకాంత్ - రాశి - రోజా కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీన్స్ ని రీ క్రియేట్ చేసారు.

Roja – Srikanth : రోజా రీ ఎంట్రీ.. సరదా కౌంటర్ ఇచ్చిన శ్రీకాంత్.. ‘సంక్రాంతి వస్తున్నాం’ సీన్ రీ క్రియేట్.. ప్రోమో వైరల్..

Roja Re Entry into TV Shows Srikanth Funny Counters to Roja Promo goes Viral

Updated On : February 26, 2025 / 3:25 PM IST

Roja – Srikanth : నటి, మాజీ మంత్రి రోజా సినిమాలతో పాటు జబర్దస్త్ లాంటి టీవీ షోలు కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ లో చేసి మెప్పించింది. కానీ గత ప్రభుత్వంలో రోజాకు మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కూడా మానేసి సినిమాలకు, టీవీ షోలకు దూరమైంది. చాన్నాళ్ల తర్వాత రోజా మళ్ళీ ఓ టీవీ షోతో రీ ఎంట్రీ ఇస్తుంది.

జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 ప్రోగ్రాంలో రోజా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల రోజా రీ ఎంట్రీ ఇచ్చినట్టు వీడియో వైరల్ అవ్వగా తాజాగా ఈ ప్రోగ్రాం నుంచి మరో ప్రోమోని రిలీజ్ చేసారు. ఈ ప్రోగ్రాంకి రోజాతో పాటు శ్రీకాంత్, రాశి కూడా వచ్చి సందడి చేసారు. ఒకప్పుడు రాశి – శ్రీకాంత్ సినిమాల్లో సూపర్ హిట్ పెయిర్ అని తెలిసిందే.

Also Read : Yash Toxic : ఈసారి పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్.. యశ్ టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ లో కూడా..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో శ్రీకాంత్ – రాశి – రోజా కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీన్స్ ని రీ క్రియేట్ చేసారు. వెంకటేష్ గా శ్రీకాంత్, ఐశ్వర్యగా రాశి నటించగా మీనాక్షి పాత్రలో రోజా నటించింది. రాశి.. మీ ఇద్దరికీ బ్రేకప్ ఎలా అయింది అని అడగ్గా రోజా.. నోట్లో నాలుక లేదు కదండీ.. అలా బ్రేకప్ అయిపోయింది అనగానే శ్రీకాంత్.. నీ నోట్లో నాలుక లేదు అంటే మా అందరికి బుర్ర లేదు అని అర్ధం అని కౌంటర్ ఇచ్చారు. రోజా.. ప్రపోజ్ చేయడానికి అక్కడికి పిలిస్తే ఎందుకు రాలేదు అని అంటే శ్రీకాంత్ వెంటనే.. అసెంబ్లీకా అని సరదా కౌంటర్ ఇచ్చారు. దీంతో రోజా పొలిటికల్ కెరీర్ దృష్టిలో పెట్టుకొని ఈ షోలో చాలానే ఫన్నీ కౌంటర్లు పడ్డాయని తెలుస్తుంది. ఆడియన్స్ వీళ్ళు చేసిన సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ స్పూఫ్ చూడటానికి ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..

 

Also Read : Ram Charan : రామ్ చరణ్ అత్త – మామ 40వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్.. క్లిన్ కారాతో చరణ్ అదుర్స్..

ప్రోమోలు ఈ రేంజ్ లో నవ్విస్తుంటే ఇక ఫుల్ షోలో ఇంకే రేంజ్ లో నవ్విస్తారో చూడాలి. ఈ షో మార్చ్ 2 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో రానుంది. రోజా రీ ఎంట్రీ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ జబర్దస్త్ కి, వేరే టీవీ షోలకు కూడా వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఒకప్పటి హిట్ పెయిర్ శ్రీకాంత్ – రాశి మరోసారి కలిసి కనపడటంతో చూడముచ్చటగా ఉన్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.