Ram Charan : రామ్ చరణ్ అత్త – మామ 40వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్.. క్లిన్ కారాతో చరణ్ అదుర్స్..

ఉపాసన తన పేరెంట్స్ అనిల్ - శోభన దంపతుల 40వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేసింది.

Ram Charan : రామ్ చరణ్ అత్త – మామ 40వ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్.. క్లిన్ కారాతో చరణ్ అదుర్స్..

Ram Charan Wife Upasana Shares her Parents 40th Wedding Anniversary Video

Updated On : February 26, 2025 / 2:37 PM IST

Upasana – Ram Charan : రామ్ చరణ్ భార్య ఉపాసన రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని తెలిసిందే. తమ సంస్థ అపోలో, తమ ఫ్యామిలీ, చరణ్ గురించి.. పోస్టులు చేస్తూ ఉంటుంది. తాజాగా ఉపాసన ఓ సెలబ్రేషన్స్ వీడియో షేర్ చేసింది.

ఉపాసన తన పేరెంట్స్ అనిల్ – శోభన దంపతుల 40వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా సెలబ్రేట్ చేసింది. దీనికి ఉపాసన ఫ్యామిలీ అంతా హాజరయ్యారు. రామ్ చరణ్ కూడా హాజరయ్యాడు. పార్టీ, సాంగ్స్, డ్యాన్స్, అనిల్ – శోభన దంపతులు రింగ్స్ మార్చుకోవడం.. ఇలా ఈ సెలబ్రేషన్స్ ని కామినేని ఫ్యామిలీ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో ఉపాసన తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది.

Also Read : Aadhi Pinisetty : నిక్కీ గల్రానీతో విడాకులు.. స్పందించిన ఆది పినిశెట్టి.. ఎంతో బాధ‌ప‌డ్డా, ఎంత‌కైనా తెగిస్తార‌ని..

ఇక ఈ వీడియోలో రామ్ చరణ్ ఫుల్ హెయిర్, గడ్డం RC16 లుక్ తో కనపడటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. చరణ్ కూడా తన అత్తామామలకు కంగ్రాట్స్ తెలిపి వారితో సరదాగా ఎంజాయ్ చేసి, వారితో ఫోటోలు దిగాడు. ఈ వీడియోలో క్లిన్ కారా కూడా కనిపించింది. ఎప్పట్లాగే క్లిన్ కారా ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. క్లిన్ కారాతో చరణ్ సందడి చేసాడు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..

Also Read : Mazaka : ‘మజాకా’ మూవీ రివ్యూ.. సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రి కొడుకులుగా నవ్వించారా?