Aadhi Pinisetty : నిక్కీ గల్రానీతో విడాకులు.. స్పందించిన ఆది పినిశెట్టి.. ఎంతో బాధ‌ప‌డ్డా, ఎంత‌కైనా తెగిస్తార‌ని..

విడాకుల వార్త‌ల‌పై న‌టుడు ఆది పినిశెట్టి స్పందించాడు.

Aadhi Pinisetty : నిక్కీ గల్రానీతో విడాకులు.. స్పందించిన ఆది పినిశెట్టి.. ఎంతో బాధ‌ప‌డ్డా, ఎంత‌కైనా తెగిస్తార‌ని..

Actor Aadhi Pinisetty respond on his Divorce News

Updated On : February 26, 2025 / 12:12 PM IST

తెలుగు వారికి న‌టుడు ఆది పినిశెట్టిని ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. రంగస్థలం, స‌రైనోడు వంటి చిత్రాల‌తో ఆయ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌ర అయ్యారు. కాగా.. ఆయ‌న హీరోయిన్‌ నిక్కీ గ‌ల్రానీని ప్రేమించి పెళ్లిచేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా వీరిద్ద‌రు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా వీటిపై ఆది పినిశెట్టి స్పందించాడు.

ఆ వార్త‌ల‌ను చూసి తాను ఎంతో బాధ‌ప‌డిన‌ట్లు చెప్పుకొచ్చాడు. అందులో ఎంత మాత్రం నిజం లేద‌న్నాడు. అలాంటి వార్తలు రాసే వారిపై కోపం వ‌చ్చిన‌ట్లు తెలిపాడు. తాను, నిక్కీ మొద‌టి నుంచి మంచి స్నేహితులుగా ఉన్నామ‌ని చెప్పాడు. త‌న కుటుంబానికి ఆమె ఎంతో చేరువైంద‌న్నాడు. అదే స‌మ‌యంలో మా కుటుంబం కూడా ఆమెకు ఎంతో న‌చ్చింది. దీంతో పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకున్న‌ట్లుగా వివ‌రించాడు.

Mazaka : ‘మజాకా’ మూవీ రివ్యూ.. సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రి కొడుకులుగా నవ్వించారా?

ప్ర‌స్తుతం తాము సంతోషంగా ఉన్నామ‌న్నాడు.’ అయితే.. కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల‌లో తామిద్ద‌రం విడిపోతున్నాం అనే క‌థ‌నాలు వ‌చ్చాయి. వాటిని చూసి నేను మొద‌ట షాక్ అయ్యాను. ఆ త‌రువాత వాటిపై చాలా కోపం వ‌చ్చింది. ఆయా ఛాన‌ళ్ల‌లోని పాత వీడియోల‌ను ప‌రిశీలించాను. ఆ త‌రువాత ఇలాంటి వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని నిర్ణయించుకున్నాను.’ అని ఆది పినిశెట్టి తెలిపారు. క్లిక్స్ కోసం వాళ్లు ఎంత‌కైనా తెగిస్తార‌ని అర్థ‌మైంద‌న్నారు.

సినీ ప్ర‌యాణం గురించి మాట్లాడుతూ..

రంగస్థలం మూవీ త‌న‌కు తెలుగుతో పాటు త‌మిళంలో మంచి పేరు తెచ్చిన‌ట్లు ఆది చెప్పుకొచ్చాడు. ఆ మూవీలో ఓ సీన్‌లో తాను చ‌నిపోయిన‌ట్లు యాక్టింగ్ చేశాన‌ని, అప్పుడు చుట్టు ఉన్న న‌టీన‌టుల యాక్టింగ్ చూసి నిజంగా తాను భ‌య‌ప‌డిన‌ట్లు చెప్పాడు. ఇక ఆ సీన్‌ను థియేట‌ర్‌లో చూసిన వాళ్ల నాన్న క‌న్నీళ్లు పెట్టుకున్న‌ట్లుగా తెలిపాడు.

Chiranjeevi-Ram Charan : దసరాకు మెగా ఫ్యాన్స్‌కు డబుల్‌ బొనాంజా!

ఇక తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం ‘శబ్దం’ . ఫిబ్రవరి 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన్న ఆది పై విష‌యాల‌ను మాట్లాడారు. ఈ చిత్రానికి అరివళగన్‌ దర్శకత్వం వ‌హిస్తున్నారు.