Naga Chaitanya : పెళ్లయిన రెండేళ్లకు అంటూ.. భార్య శోభిత ఫోటో షేర్ చేసి నాగచైతన్య స్పెషల్ పోస్ట్..
తాజాగా నాగచైతన్య శోభిత ఫోటో షేర్ చేసి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(Naga Chaitanya)
Naga Chaitanya
Naga Chaitanya : నాగచైతన్య, శోభిత 2024 డిసెంబర్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం ఓ పక్క సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూనే మరో పక్క తమ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు ఈ ఇద్దరూ తమ సోషల్ మీడియాలో ఒకరిగురించి ఒకరు పోస్టులు చేస్తూ ఉంటారు. స్పెషల్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా నాగచైతన్య శోభిత ఫోటో షేర్ చేసి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.
Also Read : Pavithra Puri : అన్నయ్య బర్త్ డే.. చిన్నప్పటి స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన పూరి జగన్నాధ్ కూతురు..
నాగచైతన్య శోభిత ఫోటో షేర్ చేసి.. పెళ్లయిన దాదాపు రెండేళ్ల తర్వాత మా ఆవిడ నా కోసం రాత్రికి భోజనం వండింది. బహుశా ఈ రోజు నేను ఏదో మంచి పని చేసి ఉంటాను అని పోస్ట్ చేసాడు. శోభిత ఆ ఫొటోలో రెండు చేతుల్లో ఫుడ్ పట్టుకొని నిల్చొని ఉంది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ పోస్ట్ తో శోభితకు వంట రాదా, రెండేళ్ల తర్వాత మొదటిసారి నీ కోసం ఫుడ్ వండిందా అని ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
