Naga Chaitanya – Sobhita Dhulipala : నాగార్జున ఇంట మొద‌లైన పెళ్లి ప‌నులు.. వేడుక‌గా నాగ‌చైత‌న్య‌-శోభిత‌ల హ‌ల్దీ..

కింగ్ అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి వేడుక‌లు మొద‌లు అయ్యాయి.

Naga Chaitanya Sobhita Dhulipala Haldi celebrations viral

కింగ్ అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి వేడుక‌లు మొద‌లు అయ్యాయి. ఆయ‌న పెద్ద కొడుకు అక్కినేని నాగ‌చైత‌న్య వివాహం శోభితా దూళిపాళ్ల‌తో జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో డిసెంబ‌ర్ 4న పెళ్లి వేడుక జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో హ‌ల్దీ వేడుక‌ను నిర్వ‌హించారు.

కాబోయే కొత్త జంట‌ను ఒకే చోట ఉంచి మంగ‌ళ‌స్నానాలు చేయించారు. సంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఈ వేడుక జ‌రిగింది. కుటుంబ స‌భ్యులు, అత్యంత సన్నిహితులు మాత్ర‌మే ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Ashok Galla : మాస్ సెంటర్స్ లో దూసుకుపోతున్న మహేష్ మేనల్లుడు.. సక్సెస్ టూర్స్ తో ప్రజల్లోకి..

ఇటీవ‌ల పెళ్లి గురించి నాగ‌చైత‌న్య మాట్లాడుతూ.. శోభిత‌తో జీవితాన్ని పంచుకునేందుకు తాను ఎదురుచూస్తున్న‌ట్లుగా తెలిపారు. పెళ్లి చాలా సింపుల్‌గా జ‌ర‌గ‌నున్న‌ట్లు చెప్పారు. ఎలాంటి ఆర్భాటాల‌కు తావులేద‌న్నారు. అతిథుల లిస్ట్‌, పెళ్లికి సంబంధించిన అన్ని విష‌యాల‌ను ఇద్ద‌రం క‌లిసి చేస్తున్న‌ట్లుగా వివ‌రించారు.

అన్న‌పూర్ణ స్టూడియోస్ త‌మ కుటుంబానికి ఎంతో ప్ర‌త్యేకం అని , స్టూడియోస్‌లోని తాత‌గారి (అక్కినేని నాగేశ్వ‌ర‌రావు) విగ్ర‌హం ఎదురుగా పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలిపారు. తాత‌య్య ఆశీస్సులు ఎప్పుడూ మాపై ఉండాల‌నే ఉద్దేశంతో ఇరు కుటుంబాలు ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లుగా చెప్పారు. ఇక త‌న జీవితంలో ఏర్ప‌డిని శూన్యాన్ని శోభిత పూడుస్తుంద‌ని తాను న‌మ్ముతున్న‌ట్లు నాగ‌చైత‌న్య తెలిపారు.

Gayathri Devi : సాఫ్ట్‌వేర్ జాబ్ నుంచి.. ఫ్యాషన్ డిజైనర్ గా మారి.. వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా..