Gayathri Devi : సాఫ్ట్‌వేర్ జాబ్ నుంచి.. ఫ్యాషన్ డిజైనర్ గా మారి.. వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా..

1948 కథ కావడంతో అప్పటి కాలానికి తగ్గట్టు మెయిన్ లీడ్స్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు అందరికి పర్ఫెక్ట్ గా డ్రెస్సులు డిజైన్ చేసారు.

Gayathri Devi : సాఫ్ట్‌వేర్ జాబ్ నుంచి.. ఫ్యాషన్ డిజైనర్ గా మారి.. వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా..

Vikkatakavi Web Series Fashion Designer Exclusive Interview a Software Engineer Turned as Fashion Designer

Updated On : November 29, 2024 / 10:44 AM IST

Gayathri Devi : ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ ఉన్నారు. తాజాగా మరో కొత్త ఫ్యాషన్ డిజైనర్ తన వర్క్ తో దూసుకుపోతుంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన వికటకవి సిరీస్ ప్రస్తుతం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. అయితే ఈ సిరీస్ కి జోశ్యుల గాయ‌త్రి దేవి ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేసి మెప్పించింది.

1948 కథ కావడంతో అప్పటి కాలానికి తగ్గట్టు మెయిన్ లీడ్స్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ వరకు అందరికి పర్ఫెక్ట్ గా డ్రెస్సులు డిజైన్ చేసారు. ఈ సిరీస్ సక్సెస్ అవ్వడంతో తాజాగా గాయత్రీ దేవి మీడియాతో మాట్లాడుతూ ఆమె గురించి, సిరీస్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Also Read : Allu Arjun : ‘పుష్ప 2’ ఫస్ట్ డే కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ఫోకస్..!

గాయత్రీ దేవి తన గురించి చెప్తూ.. కంప్యూట‌ర్ సైన్స్‌లో ఇంజ‌నీరింగ్ చేసి సామ్ సంగ్‌, మైక్రోసాఫ్ట్‌లో జాబ్స్ చేసి పలు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో జాబ్‌కి రిజైన్ చేశాను. ఎప్పటికైనా బొటిక్ పెట్టాలి అనుకునేదాన్ని. జాబ్ ఎలాగో రిజైన్ చేశాను కాబట్టి అప్పుడే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకొని బొటిక్ పెడదామనుకున్నాను. దాంతో ఫ్యాష‌న్ డిజైనింగ్ లో డిప్లోమా కోర్స్ చేశాను. ఆ తర్వాత ఫ్యాష‌న్ షోలు చేశాను. అనంతరం కొన్నాళ్ళు మెంటర్‌గా పనిచేసాను. తర్వాత నేనే సొంతంగా బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేశాను. కరోనా ముందు వరకు బాగానే రన్ అయింది. కరోనా సమయంలో బిజినెస్ క్లోజ్ అయింది అని తెలిపారు.

సినీ పరిశ్రమలోకి ఎంట్రీ గురించి చెప్తూ.. వేరే డిజైనర్స్ ద్వారా సినీ పరిశ్రమలోకి వచ్చాను. ప‌లాస సినిమాకు నేను కేవలం డిజైనింగ్ చేసిచ్చాను. అలా మొదలైన నా ప్రయాణం ఆ తర్వాత ఆహాలో కుడిఎడ‌మైతే వెబ్ సిరీస్ కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా కెరీర్ మొదలుపెట్టాను. త‌ర్వాత పారాహుషార్ అనే సినిమాకు, క‌ళాపురం సినిమాకు వ‌ర్క్‌ చేశాను. అనంతరం ప్ర‌దీప్ మ‌ద్దాలి డైరెక్ట్ చేసిన స‌ర్వం శ‌క్తిమ‌యం సిరీస్‌కు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశాను. తక్కువ బడ్జెట్ లో అవుట్ డోర్ లో తక్కువ మ్యాన్ పవర్ తో చేయడం ఆ సిరీస్ నాకు చాలా ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత హరికథ సిరీస్ కి వర్క్ చేశాను. ప్రదీప్ గారి పరిచయంతో ఈ వికటకవి సిరీస్ కూడా ఛాన్స్ వచ్చింది అని తెలిపారు.

Also Read  : Vikkatakavi : ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ.. తెలంగాణ బ్యాక్ డ్రాప్ సస్పెన్స్ థ్రిల్లర్..

వికటకవి సిరీస్ గురించి చెప్తూ.. హరికథ సిరీస్ కూడా పీరియాడిక్. అది చేస్తున్నప్పుడే వికటకవి ఛాన్స్ వచ్చింది. రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్. విక‌ట‌క‌వి సిరీస్ తెలంగాణ బ్యాక్ డ్రాప్‌, 1948 కథ కావడంతో అప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, అప్పటి మనుషులు ఎలాంటి బట్టలు వేసుకునేవారు అని చాలా రీసెర్చ్ చేశాను. పాత సినిమాలు చాలా చూసాను. వాటితో అప్ప‌టి ప్ర‌జ‌ల వేష‌ధార‌ణ‌, సంస్కృతి, సాంప్ర‌దాయాల గురించి తెలుసుకున్నాను. దానిని ఆధారంగా తీసుకొని వికటకవి సిరీస్ కు తగ్గట్టు డ్రెస్సులు ఎలా ఉండాలి అని డిజైన్ చేసుకున్నాను. ఈ సిరీస్ కి ఫ్యాబ్రిక్స్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సి వచ్చింది. మేఘ ఆకాష్ గారి లుక్ కోసం కాట‌న్‌, లెనిన్‌, ఖాదీ చీరల‌ను ఉపయోగించాం. హీరో లుక్ కోసం కూడా బాగే కష్టపడ్డాం అని తెలిపారు.

ఇక సినిమాలకు – సిరీస్ లకు మధ్య బేధం గురించి చెప్తూ.. సిరీస్‌ల‌కు బ‌డ్జెట్‌ లో ప‌రిమితులుంటాయి. త‌క్కువ బ‌డ్జెట్‌లో మంచి ఔట్‌పుట్ ఇవ్వాలి. సినిమాల విషయంలో బ‌డ్జెట్ కు కాస్త వెసులుబాటు ఉంటుంది. సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేసేట‌ప్పుడు డైరెక్ట‌ర్‌తో పాటు ఓటీటీ వాళ్ళు కూడా ఇన్‌పుట్స్ ఇస్తారు. కానీ సినిమాల్లో మాత్రం డైరెక్ట‌రే ఫైన‌ల్ డిసిష‌న్ మేక‌ర్‌. ఇప్పుడు ఓటీటీలు, వెబ్ సిరీస్ లు యంగ్ టెక్నిషియన్స్ కు మంచి ప్లాట్ ఫామ్స్ అని తెలిపారు. గాయత్రీ దేవి చేతిలో ప్రస్తుతం మర్మయోగి అనే వెబ్ సిరీస్ తో పాటు, మానసచోర సినిమాలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ చదివి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ గా వరుస సినిమాలు, సిరీస్ లతో పనిచేయడం విశేషమనే చెప్పాలి.