Naga Chaitanya: ఆమెతో లవ్ స్టోరీ.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. నాగచైతన్య!

తాతా, తండ్రి లాగానే తనయుడు నాగచైతన్య కూడా లవ్ స్టోరీస్ చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాలు వారికే కాదు, నిజ జీవితంలో కూడా 'ఏ మాయ చేసావే' అంటూ సమంతను పెళ్ళాడిన నాగచైతన్య.. ఆ మజిలీని జీవితాంతం సాగించలేక, మధ్యలోనే విడాకులు తీసుకుని విడిపోయింది ఈ జంట.

Naga Chaitanya: ఆమెతో లవ్ స్టోరీ.. నాకెన్నో పాఠాలు నేర్పింది.. నాగచైతన్య!

Naga Chaitanya Tweet On One Year For Love Story Movie

Updated On : September 24, 2022 / 5:54 PM IST

Naga Chaitanya: తాతా, తండ్రి లాగానే తనయుడు నాగచైతన్య కూడా లవ్ స్టోరీస్ చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాలు వారికే కాదు, నిజ జీవితంలో కూడా ‘ఏ మాయ చేసావే’ అంటూ సమంతను పెళ్ళాడిన నాగచైతన్య.. ఆ మజిలీని జీవితాంతం సాగించలేక, మధ్యలోనే విడాకులు తీసుకుని విడిపోయింది ఈ జంట.

Naga Chaitanya : థియేటర్ ఏమైపోతుంది అన్నారు.. నాతో అయిదు నిమిషాల ఫైట్ చేసే క్యారెక్టర్ నుండి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..

అయితే నాగచైతన్య నటించిన “లవ్ స్టోరీ” మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో మనకి తెలుసు. ఈ సినిమా విడుదలయ్యి సంవత్సరం అవ్వడంతో.. ఆ సినిమాతో ఉన్న జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు చైతు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సున్నితమైన ప్రేమ కథ, కుల వ్యవస్థలు చుట్టూ అల్లుకున్న ఒక అందమైన లవ్ స్టోరీ.

దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా.. “తనకు ఎన్నో పాఠాలు నెరిపాడమే కాదు, ఆ సినిమాతో ఉన్న జ్ఞాపకాలు, అలాగే ఆ సినిమా కూడా తనకి ఎంతో స్పెషల్ అంటూ చెబుతూ” ట్వీట్ చేశాడు నాగచైతన్య. ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.