Thandel : తండేల్ సెట్‌లో విజిల్ వేసిన అల్లు అరవింద్.. చూసుకుందాం అన్న నాగచైతన్య.. భలే వీడియో రిలీజ్ చేశారే..

ఇటీవలే భారీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తండేల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ఈవెంట్ నిర్వహించారు.

Thandel : తండేల్ సెట్‌లో విజిల్ వేసిన అల్లు అరవింద్.. చూసుకుందాం అన్న నాగచైతన్య.. భలే వీడియో రిలీజ్ చేశారే..

Naga Chaitanya Vs Allu Aravind Thandel Movie Special Video Released

Updated On : November 7, 2024 / 5:25 PM IST

Thandel : నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న సినిమా తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శ్రీకాకుళకు చెందిన పలువురు మత్స్యకారుల జీవిత కథతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే తండేల్ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా అది వైరల్ అయింది.

ఇటీవలే భారీ ప్రెస్ మీట్ పెట్టి మరీ తండేల్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ ఈవెంట్ నిర్వహించారు. తండేల్ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది అని ప్రకటించారు. అయితే తాజాగా నేడు తండేల్ సినిమా యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. తండేల్ సెట్ లో మూవీ యూనిట్ టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడారు. నాగచైతన్య, కొంతమంది మూవీ యూనిట్ ఒకవైపు డైరెక్టర్, కొంతమంది మూవీ యూనిట్ ఒకవైపు ఉండి ఆడారు. సంక్రాంతి లేదా సమ్మర్ ఎప్పుడు రిలీజ్ చేయాలి అని ఈ గేమ్ ఆడారు.

Also Read : Kamal Haasan : ‘కల్కి’లో కమల్ హాసన్.. యాస్కిన్ గెటప్ కోసం ఇంత కష్టపడ్డారా.. మేకింగ్ వీడియో చూశారా?

మధ్యలో అల్లు అరవింద్ విజిల్స్ వేసి అది నాకు వదిలేసేయండి నేను చూసుకుంటాను అని సరదాగా కనిపించారు. అలాగే ఈ వీడియోలో తండేల్ సినిమాపై వచ్చిన మీమ్స్, న్యూస్ కూడా చూపించి వీడియోని భలే తయారుచేసారు. దీంతో ఈ తండేల్ టగ్ ఆఫ్ వార్ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ వీడియో చూసేయండి..