నాగ చైతన్య ‘థ్యాంక్యూ’ ప్రారంభమైంది!

  • Published By: sekhar ,Published On : October 25, 2020 / 06:12 PM IST
నాగ చైతన్య ‘థ్యాంక్యూ’ ప్రారంభమైంది!

Updated On : October 25, 2020 / 6:32 PM IST

Naga Chaitanya’s Thankyou: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ సంస్త నిర్మిస్తున్న చిత్రం “థాంక్యూ”.. ఇష్క్, మనం, 24 వంటి వైవిధ్యమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. బి.వి.ఎస్.రవి కథ, మాటలు అందిస్తున్నారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న 20వ చిత్రమిది.

విజయదశమి పర్వదినాన సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. పిసి శ్రీరామ్ సినిమాటొగ్రఫీ, తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నా ఫస్ట్ సినిమా తర్వాత రాజు గారి బ్యానర్లో, మనం తర్వాత విక్రమ్‌తో మళ్లీ పని చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చైతు ట్వీట్ చేశారు.

‘‘ఇప్పటి వరకు చూడని స్టైల్లో సరికొత్తగా నాగచైతన్యను ప్రెజెంట్ చేసేలా సినిమా ఉంటుంది. చైతు, విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన క్లాసిక్ మూవీ మనం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబోలో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది. త్వరలోనే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు.

Image

ImageImage