కొరటాల క్లాప్‌తో నాగ శౌర్య 22 ప్రారంభం

  • Published By: sekhar ,Published On : October 28, 2020 / 11:47 AM IST
కొరటాల క్లాప్‌తో నాగ శౌర్య 22 ప్రారంభం

Updated On : October 28, 2020 / 11:57 AM IST

Naga Shaurya: యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన సినిమా షూటింగులను ఇటీవలే తిరిగి ప్రారంభించిన శౌర్య ఇప్పుడు తన సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌లో మరో సినిమా స్టార్ట్ చేసేశాడు. తన బ్యానర్లో ప్రొడక్షన్ నెం 4 గా తెరకెక్కుతున్న ఈ సినిమాను అనీష్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.

నాగ శౌర్య నటిస్తున్న 22వ సినిమా ఇది. బుధవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. యువ హీరో నారా రోహిత్ కెమెరా స్విచ్చాన్ చేయగా.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ నిచ్చారు.. అనిల్ రావిపూడి ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేశారు. యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్క్రిప్ట్ అందించారు. ఈ సినిమాకు మహతి సాగర్ సంగీతమందిస్తున్నాడు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేస్తామన్నారు.

Image

Image

Image