Naga Susheela : నా తమ్ముడు.. అక్క చెప్పిన మాటలకు ‘నాగార్జున’ ఎమోషనల్.. నాగ్ వల్లే ఆయన ప్రశాంతంగా కన్నుమూశారు..

ఈ షోలో నాగార్జున అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ షోకి మధ్యలో నాగార్జున అక్క నాగ సుశీల, అన్నయ్య వెంకట్ కూడా వచ్చారు.(Naga Susheela)

Naga Susheela

Naga Susheela : కింగ్ నాగార్జున ఇటీవల డిఫరెంట్ పాత్రలతో వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే కూలీ సినిమాలో విలన్ గా మెప్పించారు. తాజాగా నాగార్జున జీ తెలుగు ఛానల్ లో జగపతి బాబు యాంకర్ గా మొదలయిన కొత్త షో జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరయ్యాడు.(Naga Susheela)

ఈ షోలో నాగార్జున అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ షోకి మధ్యలో నాగార్జున అక్క నాగ సుశీల, అన్నయ్య వెంకట్ కూడా వచ్చారు. వీరిద్దరూ కూడా నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Also Read : Thama Teaser : ర‌ష్మిక ఫ‌స్ట్ హార‌ర్ సినిమా.. ‘థామా’ టీజ‌ర్ వ‌చ్చేసింది..

ఈ క్రమంలో నాగ సుశీల మాట్లాడుతూ.. సత్య భూషణ్(నాగ సుశీల భర్త) చివరి స్టేజిలో ఉన్నాడు. కనీసం వాటర్ కూడా తాగలేని స్టేజిలో ఉన్నాడు. బాడీ కూడా పనిచేయట్లేదు. కానీ అలా ఉన్నాడు అంతే. చినబాబు(నాగార్జున) నన్ను అడిగాడు నేను వచ్చి మాట్లాడనా సత్య భూషణ్ తో. హెల్ప్ అవుతుందేమో అంటే ట్రై చెయ్ చినబాబు అన్నా. తను, అమల, అఖిల్ ముగ్గురు వచ్చారు. చినబాబు సత్య భూషణ్ దగ్గర కూర్చొని నువ్వు వర్రీ అవ్వొద్దు. సుశీలను, పిల్లల్ని నేను చూసుకుంటాను అని చెప్పాడు. అది వర్కౌట్ అయిందేమో. నెక్స్ట్ డేనే ఆయన చనిపోయారు. ఆయన ఆ ఎమోషనల్ సపోర్ట్, ఆ బాధ్యత కోసమే ఎదురుచూశారేమో. అది నేను ఎప్పటికి మర్చిపోలేను. ఆ సమయంలో నాగ్ నాకు చేసింది నేను మర్చిపోలేను. ఇప్పుడు కూడా నా కోసం చేస్తున్నాడు. నా తమ్ముడు అయినా ఒక అన్నలాగా ఉంటాడు నాతో. అంత సపోర్ట్ ఇస్తాడు అంటూ ఎమోషనల్ అవ్వడంతో నా సిస్టర్ అంటూ నాగార్జున కూడా ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Nandamuri Family : నందమూరి కుటుంబంలో విషాదం.. ఆ హీరో తల్లి కన్నుమూత..