Naga Vamsi : గుంటూరు కారం సినిమాపై ఒకేసారి బోలెడన్ని అప్డేట్స్ ఇచ్చిన నిర్మాత.. భారీ ధరకు నైజాం హక్కులు..
తాజాగా నిర్మాత నాగవంశీ తన మ్యాడ్(MAD) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.

Naga Vamsi gives so many Updates about Mahesh Babu Trivikram Guntur Kaaram Movie
Producer Naga Vamsi : మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారం(Guntur Kaaram). ఇటీవల కొన్ని రోజులు పలు కారణాలతో షూటింగ్ వాయిదా పడి, పూజా హెగ్డే(Pooja Hegde) సినిమా నుంచి తప్పుకోవడంతో సినిమాపై అనేక వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ఒకసారి వాయిదా పడి సంక్రాంతికి అనౌన్స్ చేసిన గుంటూరు కారం అప్పుడన్నా వస్తుందా రాదా అని అందరూ సందేహిస్తున్నారు. తాజాగా నిర్మాత నాగవంశీ తన మ్యాడ్(MAD) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గుంటూరు కారం సినిమా గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. గుంటూరు కారం సినిమా 200 శాతం పక్కాగా జనవరి 12న పండక్కి రిలీజ్ అవుతుంది. షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా సాగుతుంది. అక్టోబర్ ఎండింగ్ కి టాకీ పార్టీ పూర్తవుతుంది. నాలుగు సాంగ్స్ షూట్ మిగులుతాయి. అవి నవంబర్ లో అయిపోతాయి. పూజా హెగ్డేకి బాలీవుడ్ సినిమా డేట్స్ క్లాష్ రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకుంది. థమన్ ఈ సినిమా నుంచి తప్పుకోలేదు. అనవసరంగా కొన్ని సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. దసరాకి సినిమా నుంచి ఒక మెలోడీ లవ్ సాంగ్ లిరికల్ సాంగ్ వస్తుంది. సాంగ్ లో మహేష్ బాబుని చూపిస్తాము. దిల్ రాజు గారు గుంటూరు కారం నైజాం హక్కులను భారీ ధరకు కొన్నారు. నాన్ రాజమౌళి రికార్డు ధరకు కొన్నారు. సినిమా కూడా నాన్ రాజమౌళి సినిమా కలెక్షన్స్ వస్తాయి అని అన్నారు.
Also Read : Bigg Boss 7 Day 29 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నదెవరు? బిగ్‌బాస్ కూడా తొండాట ఆడుతున్నడని శివాజీ ఫైర్..
దీంతో ఒకేసారి గుంటూరు కారం సినిమా గురించి ఇన్ని విషయాలు చెప్పడంతో మహేష్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక గుంటూరు కారం సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని చినబాబు తెరకెక్కిస్తున్నారు.
Attitude tho kudina…Nammakam tho vochina…Warning Tone ⚠️#GunturKaaram
— SunnY™️ (@SSMB_For_Life) October 2, 2023
Nizam NON SSR Highest Business Done For #GunturKaaram By Dilraju
Nizam Emperor @urstrulyMahesh 👑 pic.twitter.com/DuqdGDnSwL
— Kurnool Mahesh FC ™ (@KurnoolDHFMs) October 2, 2023
HIGHLIGHT POINTS from @vamsi84 interview with @M9Breaking
In & out about #GUNTURKAARAM 🌶️ #MaheshBabu | @urstrulymahesh pic.twitter.com/lLmzISGDgw
— VardhanDHFM (@_VardhanDHFM_) October 2, 2023
#GunturKaaram update🥁 pic.twitter.com/pYJj46nHZW
— Uppi (@UpendraDhfm_) October 2, 2023