Nagarjuna Dhanush Rashmika Mandanna Kuberaa Movie Theatrical Business Details
Kuberaa : నాగార్జున – ధనుష్ మెయిన్ లీడ్స్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. రష్మిక ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి నెలకొల్పారు. ఇప్పటివరకు వచ్చిన శేఖర్ కమ్ముల సినిమాలకు ఇది డిఫరెంట్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
టాలీవుడ్ సమాచారం ప్రకారం కుబేర సినిమాకు వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 65 కోట్లకు జరిగిందని తెలుస్తుంది. రెండు తెలుగు స్టేట్స్ కలిపి 33 కోట్లకు, తమిళనాడులో 18 కోట్లకు, మిగతా ఇండియా అంతా కలిపి 5.50 కోట్లకు, ఓవర్సీస్ లో 8.50 కోట్లకు కుబేర థియేటరికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. కుబేర హిట్ అవ్వాలంటే కనీసం 70 కోట్లు షేర్ కలెక్షన్స్ రావాలి. అంటే 140 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రావాలి.
Also Read : Spirit : ‘స్పిరిట్’లో యానిమల్ నటుడు.. మెగాస్టార్ ఫ్రేమ్.. రెడ్డి బ్రదర్స్ అంటూ పోస్ట్ .. ఫొటో వైరల్..
ఇద్దరు స్టార్ హీరోలు ఉండటం, రష్మిక ఉండటం, పాన్ ఇండియా రిలీజ్, పెద్ద సినిమా వచ్చి చాలా రోజులవడం.. ఈ అంశాలన్నీ కుబేరకు కలిసొచ్చేలానే ఉన్నాయి. కానీ మూవీ యూనిట్ ప్రమోషన్స్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండు అని భావిస్తున్నారు.
అయితే ధనుష్ లాంటి స్టార్ హీరో ఉన్నా తమిళ్ కంటే తెలుగులోనే ఎక్కువ థియేట్రికల్ బిజినెస్ అవ్వడం గమనార్హం. నాగార్జున, శేఖర్ కమ్ముల, రష్మిక స్టార్ డమ్ తెలుగులో బాగానే వర్కౌట్ అయింది. ఇక కుబేర సినిమాకు ఏపీలో 75 రూపాయలు టికెట్ పెంపుకు కూడా అనుమతి ఇచ్చారు. దీంతో కుబేర 100 కోట్ల కలెక్షన్స్ అయితే గ్యారెంటీ రప్పిస్తుంది అని అంచనా వేస్తున్నారు.
Also See : Abhignya Vuthaluru : అందాల ‘అభిజ్ఞ’.. విరాటపాలెం ఈవెంట్లో లెహంగాలో మెరుపులు..