Spirit : ‘స్పిరిట్’లో యానిమల్ నటుడు.. మెగాస్టార్ ఫ్రేమ్.. రెడ్డి బ్రదర్స్ అంటూ పోస్ట్ .. ఫొటో వైరల్..

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు.

Spirit : ‘స్పిరిట్’లో యానిమల్ నటుడు.. మెగాస్టార్ ఫ్రేమ్.. రెడ్డి బ్రదర్స్ అంటూ పోస్ట్ .. ఫొటో వైరల్..

Upendra Limaye will act in Prabhas Sandeep Reddy Vanga Spirit Movie Photo goes Viral

Updated On : June 19, 2025 / 3:48 PM IST

Spirit : సందీప్ రెడ్డి వంగ త్వరలో ప్రభాస్ తో స్పిరిట్ సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ లో మొదలు అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా తృప్తి డిమ్రీ నటిస్తుందని ప్రకటించాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సందీప్ వంగ ఇటీవల లొకేషన్స్ కూడా ఫైనల్ చేసాడు. మెక్సికోలో షూటింగ్ చేస్తాను అని తెలిపాడు.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో నటీనటులను ఫైనల్ చేసే పనిలో పడ్డాడు. తాజాగా యానిమల్ నటుడు ఉపేంద్ర లిమయే స్పిరిట్ లో భాగమయినట్టు తెలుస్తుంది. యానిమల్ లో మెషిన్ గన్ అమ్మే పాత్రలో ఉపేంద్ర లిమయే తన నటనతో అందర్నీ మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కామెడీతో అలరించాడు.

Also Read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ నుంచి ఫోటో వైరల్.. శ్రీలీల బర్త్ డే సెలెబ్రేట్ చేసిన పవర్ స్టార్..

తాజాగా ఉపేంద్ర లిమయే హైదరాబాద్ లోని సందీప్ రెడ్డి వంగ ఆఫీస్ కి వచ్చాడు. సందీప్ ఆఫీస్ లో చిరంజీవి ఫొటో ఫ్రేమ్ ఉంటుందని తెలిసిందే. ఆరాధన సినిమాలోని చిరంజీవి లుక్ ని ఫ్రేమ్ చేయించాడు సందీప్ వంగ. ఉపేంద్ర లిమయే సందీప్, అతని అన్న ప్రణయ్ రెడ్డి వంగతో చిరంజీవి ఫోటో ఫ్రేమ్ వద్ద దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

ఈ ఫొటో షేర్ చేసి.. హైదరాబాద్ లో భద్రకాళి పిక్చర్స్ కొత్త ఆఫీస్ లో రెడ్డి బ్రదర్స్ ని కలవడం సంతోషంగా ఉంది. రెడ్డి బ్రదర్స్ హై స్పిరిట్ లో ఉన్నారు అంటూ స్పిరిట్ లో తాను నటించబోతున్నట్టు హింట్ ఇచ్చేసాడు. దీంతో ఉపేంద్ర లిమయే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించబోతున్నట్టు తెలుస్తుంది.

Also Read : Uppu Kappurambu : సుహాస్ – కీర్తి సురేష్ ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ వచ్చేసింది.. స్మశానంలో స్థలం కోసం గొడవ..