Bigg Boss 8 : హౌస్ మేట్స్ కి ఇచ్చిపడేసిన నాగార్జున.. పృథ్విని పై నుండి కిందికి చూస్తూ..

Bigg Boss 8 : హౌస్ మేట్స్ కి ఇచ్చిపడేసిన నాగార్జున.. పృథ్విని పై నుండి కిందికి చూస్తూ..

Nagarjuna fires on house mates Bigg Boss 8 promo goes viral

Updated On : October 26, 2024 / 5:44 PM IST

Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. చూస్తూ చూస్తూ నే 55 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికే గతవారం హౌస్ నుండి మణి ఎలిమేనేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఇంట్లో నుండి బయటికి వస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

Also Read : Raashii Khanna : IAS అవ్వబోయి హీరోయిన్ అయిన రాశీఖన్నా.. స్టడీలో టాపర్ అయి కూడా..

అయితే ఎప్పటిలాగానే నేడు బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ చేశారు. ప్రతీ శనివారం నాగ్ ఫుల్ అవుతూ వస్తారు. ఆలా నేటి ప్రోమోలో కూడా నాగ్ వస్తూనే హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యారు. నామినేషన్స్ లో పెట్టిన కుండలను స్టేజ్ పై పగలగొట్టారు. ముందు పృథ్వి కుండ పగలగొడుతూ.. కింది నుండి పైదాకా చూసి.. ఎలా అనిపిస్తుంది బాడీ షేమింగ్ చేస్తున్న అనిపిస్తుందా అంటే లేదు సర్ నా ఉద్దేశం అది కాదు అన్నాడు. రోహిణి పృథ్వి కి జరిగిన గొడవను ఉద్దేశిస్తూ నాగ్ ఇలా చేసారు. తర్వాత నాగ్.. పృథ్వి అనగానే నిఖిల్ కూడా రావాలి .. క్విజ్ టాస్క్ లో నువ్వు చేసింది మాకు అర్ధం కాలేదు అని చెప్పి.. నిఖిల్ చేసింది కరెక్టా అని తేజని అడిగారు.. తేజ వెంటనే కాదని అన్నాడు. ఆ తర్వాత నాగ్ తేజని నీ కుట్ర నువ్వు పన్నావ్ అని ఫైర్ అయ్యారు.

అనంతరం నాగ్.. యష్మిపై మండిపడుతూ.. విష్ణుని ఎందుకు నామినేట్ చేసావ్ అంటే.. 7 వీక్స్ నుండి తన గేమ్ కనిపించట్లే అని చేశా అని చెప్తుంది. అప్పుడు నాగ్.. మరి నువ్వు ఏం చేస్తున్నావ్ అని అన్నారు. తర్వాతా నబీల్ తో.. యాభైవేలు పోతాయని తెలిసి కూడా హరితేజను నామినేట్ చేసావ్ కదా అని అంటే పాయింట్స్ ఉన్నాయ్ కాబట్టి చేశా అన్నాడు. అలాగే హరితేజ నువ్వు నయని ఏ క్లాన్ లో ఉన్నారు అని నాగ్ అన్నారు. దానికి హరితేజ అందరూ రోహిణినే సెలెక్ట్ చేస్తున్నారు అని అంటుంది. తర్వాత గౌతమ్ తో.. నీది ఇక్కడో మాట, అగ్రేషన్ వచ్చినప్పుడు ఓ మాట రానప్పుడు ఇంకో మాట అని చెప్పడం తో ప్రోమో ఎండ్ అవుతుంది. మొత్తానికి నాగ్ ఈ వారం హౌస్ మేట్స్ కి గట్టిగానే ఇచ్చినట్టు తెలుస్తుంది.