Raashii Khanna : IAS అవ్వబోయి హీరోయిన్ అయిన రాశీఖన్నా.. స్టడీలో టాపర్ అయి కూడా..

Raashii Khanna Wanted to become an IAS but became an actress.
Raashii Khanna : టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచినప్పటి నుండి ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో సైతం పలు సినిమాలు చేసింది.ఇక ఈ మధ్య తనకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ టాలీవుడ్ సోయగం. హిందీలో సినిమాలు చేస్తున్నప్పటికీ తనకి ఇంకా సరైన సక్సెస్ రాలేదు.
Also Read : Pushpa 2 : బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా అల్లు అర్జున్ పుష్ప-2.. సరికొత్త రికార్డ్ ?
అయితే తాజాగా ఈ బ్యూటీ ABP నెట్‌వర్క్ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఇందులో రాశీ మాట్లాడుతూ.. నా జీవితంలో నేను అనుకున్నది ఏదీ జరగలేదు. నేను విధిని నమ్ముతాను, నేను కోరుకున్నది ఏదీ ఇప్పటి వరకు నాకు దక్కలేదు. నిజానికి నేను IAS ఆఫీసర్ అవ్వాలని కోరుకున్నాను. కానీ అది జరగలేదు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగే వారు ఒక మంచి సేఫ్టీ ఉద్యోగం కావాలని అనుకుంటారు. నేను కూడా అలానే IAS అయితే రక్షణగా ఉంటుంది కచ్చితంగా చెయ్యాలి అనుకున్నా, సబ్జెట్ లో కూడా నేను టాపర్. కానీ నేను ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకున్నాడు. ఆయన అనుకున్న దాని ప్రకారమే నేను ఇప్పుడు నటి అయ్యాను అంటూ తెలిపారు.
అనంతరం హీరోయిన్ అవ్వడం గురించి మాట్లాడుతూ.. నాకు హీరోయిన్ అవ్వడం అంత కష్టమేమీ కాలేదు. కానీ అందరికీ అలా ఉండదు. నటీనటులు అవ్వడం చాలా కష్టం. ప్రపంచం మొత్తంలో భద్రత లేని జాబ్ ఏదన్న ఉందంటే అది ఇదే అంటూ తెలిపింది రాశి ఖన్నా. దీంతో ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.