Nagarjuna : ఏం మాట్లాడాలన్నా భయం.. ఎక్కడ ఏ కెమెరా పెడతారో అని భయం.. నాగార్జున కామెంట్స్ వైరల్..
ఇటీవల సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోన్స్ తీసి వీడియోలు తీస్తున్న సంగతి తెలిసిందే. (Nagarjuna)
Nagarjuna
Nagarjuna : అఖిల్ అక్కినేని లెనిన్ సినిమాతో రాబోతున్నాడు. జులై 10 ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మేట నిర్వహించారు. ఈ సినిమాకు నాగార్జున కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో నేడు జరిగిన ప్రెస్ మీట్ కి నాగార్జున కూడా హాజరయ్యారు.
ఇటీవల సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోన్స్ తీసి వీడియోలు తీస్తున్న సంగతి తెలిసిందే. పాపరాజిలు అంటూ పలువురు సెలబ్రిటీలు ఎక్కడ కనపడినా ఎలా ఉన్నా వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రెస్ మీట్స్ కి వచ్చినా వీడియోలు, మీడియా అడిగే ప్రశ్నలతో సెలబ్రిటీలు వైరల్ అవుతున్నారు. దీనిపై నాగార్జున లెనిన్ ప్రెస్ మీట్ లో కామెంట్స్ చేశారు.
నాగార్జున మాట్లాడుతూ.. మీ అందర్నీ చూస్తుంటే నా కెరీర్ మొదటి రోజులు గుర్తొచ్చాయి. ఒకప్పుడు ఆరుగురు ఉండేవాళ్ళు, ఒకరు ఫోటోగ్రాఫర్ ఉండేవాళ్ళు. ఫోన్స్, కెమెరాలు, రికార్డింగ్స్ ఏమి ఉండేవి కాదు. రేపు సినిమా రిలీజ్ అంటే ఒక ఆరుగురే ఉండేవాళ్ళు. వాళ్ళే ప్రశ్నలు అడిగే వాళ్ళు. భయం కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాట్లాడాలంటే భయం. ఏం అడుగుతారు? ఎక్కడ ఏ కెమెరా పెడతారు అని భయం వేస్తుంది. ఫ్రీజ్ అయి ఉంటున్నాము అని అన్నారు. దీంతో నాగ్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
