‘వైల్డ్ డాగ్’ విజయ్ వర్మగా ‘కింగ్’ నాగార్జున..

  • Published By: sekhar ,Published On : August 29, 2020 / 03:13 PM IST
‘వైల్డ్ డాగ్’ విజయ్ వర్మగా ‘కింగ్’ నాగార్జున..

Updated On : August 29, 2020 / 4:11 PM IST

Nagarjuna Poster from Wild Dog: కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు ఈరోజు(ఆగ‌స్ట్ 29). ఈ సంద‌ర్భంగా ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’ (Wild Dog) సినిమా పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించే అగ్ర క‌థానాయ‌కుల్లో ముందుండే నాగార్జున, అహిషోర్ సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నారు.


https://10tv.in/japans-pm-shinzo-abe-announces-resignation/
ఇందులో నాగార్జున ఎన్‌.ఐ.ఎ ఆఫీస‌ర్ విజయ్ వ‌ర్మ‌గా క‌నిపించ‌నున్నారు. ఈ పోస్ట‌ర్‌లో నాగార్జున‌తో పాటు ఆయ‌న టీమ్‌ను కూడా చిత్ర యూనిట్ ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం చేసింది. డేర్ డెవిల్ అయిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌గా నాగార్జున ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.