పాతికేళ్ల ‘ఘరానా బుల్లోడు’..

అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కలయికలో రూపొందిన ‘ఘరానా బుల్లోడు’ 25 సంవత్సరాలు పూర్తి..

పాతికేళ్ల ‘ఘరానా బుల్లోడు’..

Updated On : January 20, 2022 / 4:13 PM IST

అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కలయికలో రూపొందిన ‘ఘరానా బుల్లోడు’ 25 సంవత్సరాలు పూర్తి..

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, ఆమని హీరో హీరోయిన్లుగా.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ మ్యూజికల్ ఎంటర్‌టైనర్.. ‘ఘరానా బుల్లోడు’.. 1995 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం 2020 ఏప్రిల్ 27 నాటికి విజయవంతంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.

RK Film Associates బ్యానర్‌పై నిర్మించిన ‘ఘరానా బుల్లోడు’ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. కీరవాణి సంగీతమందించిన ‘భీమవరం బుల్లోడా పాలు కావాలా’ ఎవర్ గ్రీన్ సాంగ్‌గా నిలిచింది. నాగ్ తన స్టైల్ మాస్ నటనతో మెప్పించగా.. జయచిత్ర, కోట, మురళీ మోహన్ తదితరులు తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతమందించారు. ‘ఘరానా బుల్లోడు’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.