#ANRLivesON – ఎక్కడున్నా హ్యాపీ బర్త్‌డే నాన్న..

  • Published By: sekhar ,Published On : September 20, 2020 / 07:40 PM IST
#ANRLivesON – ఎక్కడున్నా హ్యాపీ బర్త్‌డే నాన్న..

Updated On : September 20, 2020 / 8:18 PM IST

ANR Birth Anniversary: ‘నటసామ్రాట్’ అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు సినిమా చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించి, తెలుగు ప్రేక్షకాభిమానుల ఆదరణ చూరగొన్న మహోన్నత వ్యక్తి. సెప్టెంబర్ 20న అక్కినేని పుట్టినరోజు. 1923 సెప్టెంబర్ 20న కృష్ణాజిల్లా రామాపురంలో జన్మించారాయన.


ఏఎన్నార్ జయంతి సందర్భంగా ప్రేక్షకులు, అక్కినేని అభిమానులు, సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు.
తనయుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా తండ్రికి శుభాకాంక్షలు తెలిపినవారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు.


నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఉనికి, మార్గదర్శకత్వం (Presence and Guidance) ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి అంటూ నాగ్ ట్వీట్ చేశారు.
అక్కినేని కుటుంబ సభ్యులు అన్నపూర్ణ స్టూడియోలో ఏఎన్నార్ జయంతి వేడుకలు నిర్వహించారు.