సితార డాడీ కూతురు.. కొత్త పిక్ షేర్ చేసిన నమ్రత, సోషల్ మీడియాలో వైరల్

  • Published By: naveen ,Published On : August 30, 2020 / 01:38 PM IST
సితార డాడీ కూతురు.. కొత్త పిక్ షేర్ చేసిన నమ్రత, సోషల్ మీడియాలో వైరల్

Updated On : August 30, 2020 / 2:18 PM IST

లాక్ డౌన్ పీరియడ్ ను టాలీవుడ్ నటీనటులు తమకు నచ్చిన రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. కొందరు పిల్లలే లోకంగా కాలం గడిపేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం లాక్ డౌన్ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పిల్లలతో సరదాగా గడుపుతూ.. నచ్చిన సినిమాలను చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు. తన పిల్లలు గౌతమ్, సితారతో కలిసి మహేష్ చేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నమ్రతా అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.

తాజాగా మహేశ్‌, సితార కలిసి ఉన్న ఓ ఫోటోను నమ్రత తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఆ ఫోటోలో.. సితార.. కుర్చీలో పడుకొని ట్యాబ్‌లో ఏదో వీడియో చూస్తుంది. పక్కనే మహేశ్‌ కూర్చొని తన గారాల పట్టి ఏం చూస్తూందో అన్నట్లు ట్యాబ్‌లోకి చూస్తున్నాడు. సితార డాడీ మహేశ్‌పై కాళ్లు వేసుకొని నవ్వుతూ వీడియో చూస్తుంది. నమ్రత ఈ ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ..సితార డాడీ కూతురు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. మన దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు పరశురామ్.

 

View this post on Instagram

 

Gadget time over ???!! #daddysgirl #itsalllove❤️

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on