జీవితంలో స్పెషల్ సినిమా ఇదే అంటోన్న నమత్రా
యాక్టర్ నమ్రతా శిరోద్కార్ ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కొద్ది రోజులుగా ఫ్యామిలీ గురించి, కెరీర్ గురించి పోస్టులు పెడుతున్న నమ్రతా తన చివరి సినిమా షూటింగ్ సమయంలో గ్రూప్ ఫొటోను పోస్టు చేశారు. Bride & Prejudice సినిమా లండన్‌లో 3నెలల పాటు షూటింగ్ జరుగుతుండగా చివరి రోజుల్లో దిగిన ఫొటో ఇది.

ఫొటోను పోస్టు చేస్తూ.. ఈ సినిమా తనకెందుకు అంత ప్రత్యేకమో రాసుకొచ్చారు. ‘ఇది చాలా ప్రత్యేకం. నా చివరి సినిమా సెట్స్ పై ఇది నాకు చివరి రోజు. Bride & Prejudice. నా సినిమా దశలో ఇది ఓ ముగింపు. మూడు నెలలు లండన్ లో షూటింగ్ తర్వాత పెళ్లి చేసుకుని ఇంటికే పరిమితమైయ్యా. అక్కడ ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేశా. చాలా జ్ఞాపకాలు నిండి ఉన్నాయి’ అంటూ పోస్టు చేసింది.
ఈ సినిమా లీడ్ రోల్ లో ఐశ్వర్యరాయ్ నటించింది. నమ్రతా ఆమె సిస్టర్ క్యారెక్టర్ లో కనిపించారు. నమ్రతా హీరో హిందూస్థానీ, వాస్తవ్ సినిమాలతో ఫ్యామస్ అయ్యారు. సూపర్ స్టార్ మహేశ్ ను 2005లో వివాహం చేసుకున్నారు. వంశీ సెట్స్ లో కలిసిన వీరి ప్రేమ చిగురించి పెళ్లి వరకూ చేరింది. 2006లో పుట్టిన గౌతం కృష్ణ, 2012లో పుట్టిన సితార వీరి సంతానం.
ఇటీవల నమ్రతా.. కూతురు సితార, కొడుకు గౌతంల ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా మహేశ్ కూడా ఇంట్లోనే ఉంటుండటంతో ఫ్యామిలీ లైఫ్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.