Akhanda 2: అఖండ 2 సెన్సార్ రివ్యూ.. బాలయ్య-బోయ కాంబోలో మరో సంచలనం కన్ఫర్మ్..
నందమూరి బాలకృష్ణ అఖండ 2(Akhanda 2)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ డివోషనల్ మాస్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Nandamuri Balakrishna Akhanda 2 censor review is now out
Akhanda 2: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యమ స్పీడ్ లో ఉన్నారు. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సీనియర్ హీరోలలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. కేవలం సినిమాలు చేయడమే అక్కడ తరువాత వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహా రెడ్డి, డాకు మహారాజ్. సీనియర్ హీరోలలో ఈ రికార్డ్ ఎవరికీ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు ఆ హిట్ ట్రాక్ ను కంటిన్యూ చేయడానికి అఖండ 2(Akhanda 2)తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు బాలకృష్ణ. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ డివోషనల్ మాస్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈనేపథ్యంలోనే తాజాగా అఖండ 2 సినిమాను సెన్సార్ కి పంపించారు మేకర్స్. సెన్సార్ వాళ్ళు ఈ సినిమా U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. అంతేకాదు, సినిమా చూసిన తరువాత సెన్సార్ సభ్యుల నుంచి అభినందనలు అందుకున్నారట మేకర్స్. సెన్సార్ సభ్యులు చెప్పినదాని ప్రకారం అఖండ 2 సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ విత్ గుడ్ డివోషనల్ ఎలిమెంట్స్. బోయపాటి ప్రతీ సినిమాల్లొ లాగే టైటిల్ కార్డు అదిరిపోగా బాలకృష్ణ ఎంట్రీ మాస్ ఆడియన్స్ కి పీక్స్ నచ్చుతుందట. మధ్యలో వచ్చే యాక్షన్ బ్లాక్స్, బాలయ్య మాస్ డైలాగ్స్ కూడా అదిరిపోతాయట.
ఇక ఇంటర్వెల్ లో వచ్చే 20 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ సినిమాకె హైలెట్ గా నిలువనుందట. ఆ తరువాత అఘోర ఎంట్రీ, హిమాలయాల సీన్స్, అక్కడ ఫైట్ సీక్వెన్స్, కుంభమేళా సీన్స్ చాలా హైలెట్ కానున్నాయట. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవడం ఖాయం అని టాక్ వస్తోంది. ఇక ఈ సినిమా ఎండింగ్ లో అఖండ 3కి లీడ్ ఇస్తూ ముగించారట. ఇక సెన్సార్ నుంచి పాజిటీవ్ టాక్ రావడంతో మేకర్స్ చాలా హ్యాపీగా ఉన్నారట. అలాగే డిసెంబర్ 5న కూడా అదే పాజిటీవ్ రెస్పాన్స్ వస్తుంది అని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మరి విడుదల తరువాత ఈ సినిమా ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.
