Sr NTR : ఎన్టీఆర్ 27వ వర్ధంతి.. ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళ్లు అర్పించిన నందమూరి హీరోలు..

తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి 'నందమూరి తారక రామారావు'. నటుడిగా ప్రేక్షకుల చేత విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా మన్ననలు అందుకున్నాడు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారికీ ఆత్మగౌరవం అయ్యాడు. పద్మశ్రీ, డాక్టరేట్ వంటి గౌరవాన్ని అందుకున్న ఈ తారక రాముడు జనవరి 18న 1996లో మరణించాడు. నేడు ఆయన 27వ వర్ధంతి కావడంతో హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ సమాధి వద్ద నందమూరి హీరోలు నివాళులు అర్పించారు.

Nandamuri heroes tributes at NTR's tomb

Sr NTR : తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ‘నందమూరి తారక రామారావు’. నటుడిగా ప్రేక్షకుల చేత విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా మన్ననలు అందుకున్నాడు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారికీ ఆత్మగౌరవం అయ్యాడు. పద్మశ్రీ, డాక్టరేట్ వంటి గౌరవాన్ని అందుకున్న ఈ తారక రాముడు జనవరి 18న 1996లో మరణించాడు. నేడు ఆయన 27వ వర్ధంతి కావడంతో హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ సమాధి వద్ద నందమూరి హీరోలు నివాళులు అర్పించారు.

Sr NTR Idol : అమెరికాలో మొట్ట మొదటి ఎన్టీఆర్ విగ్రహం.. త్వరలోనే..

మొన్నటి వరకు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పనులతో అమెరికాలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక ఈరోజు తెల్లవారుజామున కళ్యాణ్ రామ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్, కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకొని పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. ఆ తరువాత నందమూరి బాలకృష్ణ కూడా సమాధి వద్దకి చేరుకొని తండ్రి ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించాడు.

ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. సినీ, రాజకీయ రంగంలో నందమూరి తారక్ రామారావు గారు తిరుగులేని శక్తిగా రాణించారు. రాజకీయ నేతగా ఆయన అందించిన సేవలు, పాలనా సంస్కరణలు మైలు రాయిగా నిలిచాయి. తెలుగు వారి గుండెల్లో ఆయనకి ప్రత్యేక స్థానం ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే జాతీయ పార్టీలను ఒక ధాటి పైకి తీసుకు వచ్చి ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ఎదురు నిలిచారు అంటూ గుర్తు చేశారు.

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులూ కూడా ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు. కాగా ఈ ఏడాది ఎన్టీఆర్ శత జయంతి కావడంతో సంవత్సరం క్రిందటి నుంచి శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమెరికా న్యూజెర్సీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించనున్నట్టు ప్రకటించారు. ఒక తెలుగు వాడి విగ్రహం విదేశాల్లో స్థాపించడం ఇదే మొదటిసారి.