Sr NTR Idol : అమెరికాలో మొట్ట మొదటి ఎన్టీఆర్ విగ్రహం.. త్వరలోనే..

మొదటిసారి అమెరికాలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టబోతున్నారు. అమెరికాలో ఇటీవల తెలుగు వారి సంఖ్య బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా న్యూజెర్సీలో ఎడిసన్ సిటీ నాయకులు అక్కడ ఒక ప్రాంతంలో ప్రపంచంలోని.........

Sr NTR Idol : అమెరికాలో మొట్ట మొదటి ఎన్టీఆర్ విగ్రహం.. త్వరలోనే..

sr ntr idol will placed in america soon

Updated On : December 20, 2022 / 10:38 AM IST

Sr NTR Idol :  తెలుగు వారికి ఆప్తుడు, తెలుగు ఆత్మగౌరవానికి ప్రతీక, నటుడు, మాజీ సీఎం నందమూరి తారకరామారావు గారిని ఇప్పటికీ ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు. ఆయన లేకపోయినా అయన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఆయన్ని పూజిస్తారు కూడా. ఆయన సినిమాలు, ఆయన చేసిన సేవలు ప్రజలు ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మహనీయునికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి.

అయితే మొదటిసారి అమెరికాలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టబోతున్నారు. అమెరికాలో ఇటీవల తెలుగు వారి సంఖ్య బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా న్యూజెర్సీలో ఎడిసన్ సిటీ నాయకులు అక్కడ ఒక ప్రాంతంలో ప్రపంచంలోని గొప్ప గొప్ప నాయకుల విగ్రహాలని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించాలని నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ తరపున ప్రముఖ టాలీవుడ్ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఎడిసన్ సిటీ మేయర్ సామ్ జోషికి ప్రతిపాదించారు.

Mohan Babu : ఆ గవర్నమెంట్‌కి పోలీస్‌లు తొత్తులుగా ఉంటున్నారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..

ఈ ప్రతిపాదనని ఎడిసన్ సిటీ మేయర్ అంగీకరించారు. దీంతో 2023లో ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించనున్నట్టు ప్రకటించారు. దీనిపై అమెరికాలో ఉండే తెలుగు వారితో పాటు, ఇక్కడి తెలుగు ప్రజలు, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.