Mokshagna: నందమూరి మోక్షజ్ఞ సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది.. కెవ్వుకేక..
మోక్షజ్ఞ సినిమాను ఇతర దర్శకుడు చేస్తాడని కూడా ప్రచారం జరిగింది.

Nandamuri Mokshagna
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడు ప్రవేశిస్తారు? అతడి తొలి సినిమా దర్శకుడు ఎవరు? అనే విషయంపై నందమూరి అభిమానులు సందిగ్ధతలో ఉన్నారు. దీనిపై స్పష్టత కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను దర్శకుడు ప్రశాంత్ వర్మపై బాలకృష్ణ పెట్టడంతో.. అతడి ఎంట్రీకి చాలా సమయం ఉందని అర్థమవుతోంది.
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ చేతిలో ‘జై హనుమాన్’ సినిమా ఉంది. ఆ మూవీ అనంతరమే మోక్షజ్ఞ సినిమాను టేకప్ చేస్తానని ఇప్పటికే బాలకృష్ణకు ప్రశాంత్ వర్మ చెప్పారు. దీంతో బాలకృష్ణ కూడా ఇందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్‌లో మోక్షజ్ఞ నటనతో పాటు డాన్స్‌లో మరింత శిక్షణ పొందనున్నట్లు సమాచారం. దీంతో ఏడాదిలో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేది దాదాపుగా లేనట్లే.
Also Read: లైలా ఫ్లాప్.. ఫ్యాన్స్‌కు విశ్వక్ సేన్ లెటర్.. క్లాస్, మాస్ ఏదైనా సరే ఇకపై..
మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అతడి సినిమా పూజా కార్యక్రమాల దాకా వెళ్లి ఒక్కసారిగా ఆగిపోయింది. అనంతరం మోక్షజ్ఞ సినిమాపై ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి. ఆ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్లు వదంతులు వచ్చాయి.
మోక్షజ్ఞ సినిమాను ఇతర దర్శకుడు చేస్తాడని కూడా ప్రచారం జరిగింది. చివరకు మోక్షజ్ఞను తెరపై పరిచయం చేసే దర్శకుడు ప్రశాంత్ వర్మనే అని మళ్లీ వార్తలు వస్తున్నాయి. అయితే, మోక్షజ్ఞతో సినిమాకు చాలా సమయం పడుతుండడం గమనార్హం. అయినప్పటికీ ఈ సినిమాను జై హనుమాన్ మూవీ తర్వాత చేస్తానని బాలకృష్ణ వద్ద ప్రశాంత్ వర్మ అనుమతి తీసుకోవడంతో వీరి మూవీ రద్దు కాలేదన్న విషయం స్పష్టమవుతోంది.