నందమూరి తారకరత్న – ‘దుర్గ’

నందమూరి తారకరత్నపూర్తిస్థాయి విలనిజం చూపించనున్న ‘దుర్గ’ (నరరూప రాక్షసుడు).. దీపావళికి షూటింగ్ ప్రారంభం కానుంది..

  • Published By: sekhar ,Published On : October 1, 2019 / 09:22 AM IST
నందమూరి తారకరత్న – ‘దుర్గ’

Updated On : October 1, 2019 / 9:22 AM IST

నందమూరి తారకరత్నపూర్తిస్థాయి విలనిజం చూపించనున్న ‘దుర్గ’ (నరరూప రాక్షసుడు).. దీపావళికి షూటింగ్ ప్రారంభం కానుంది..

నందమూరి తారకరత్న హీరో నుండి విలన్‌గా మారి.. ‘అమరావతి’, ‘రాజా చెయ్యివేస్తే’, ‘రాజా మీరు కేక’ లాంటి సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్లీ విలన్ వేషం వెయ్యనున్నాడు. తారకరత్న పూర్తిస్థాయి విలనిజం చూపించనున్న కొత్త సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

విజయవాడ బ్యాక్ డ్రాప్‌లో కథ సాగుతుంది. కథ రీత్యా షూటింగ్ చాలా వరకు కృష్ణాజిల్లాలో జరుగనుంది. ఈ మూవీకి ‘దుర్గ’, అనే టైటిల్ ఫిక్స్ చేశారు. (నరరూప రాక్షసుడు) ట్యాగ్ లైన్.. తారక రత్న విలనిజం భయంకరంగా ఉంటుందని తెలుస్తుంది.

Red Also : విజయ్‌కి విలన్‌గా విజయ్ సేతుపతి..

ఈ మూవీ కోసం జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న ఫోటోను తారక రత్న సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. వైరల్ అవుతుంది. దీపావళికి షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి..