FNCC : బాలయ్య భార్య చేతుల మీదుగా.. FNCC విన్నర్స్ కి బెంజ్ కార్..

తాజాగా FNCC నిర్వహించిన బంపర్ తంబోలా కార్యక్రమంలో FNCC సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, అతిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Nandamuri Vasundhara gives Benz car to FNCC Bumper Tambola Winners

FNCC Bumper Tambola : FNCC(ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్) రెగ్యులర్ గా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఇటీవల గేమ్స్ నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందించారు. తాజాగా FNCC నిర్వహించిన బంపర్ తంబోలా కార్యక్రమంలో FNCC సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, అతిధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ బంపర్ తంబోలాలో గెలిచిన వారికి ఏకంగా 5 రౌండ్స్ లో ఐదు కార్లు ఇచ్చారు. ఆల్టో, సెలెరియో, టాటా టియాగో, టొయోట గ్లాంజాతో పాటు ఫైనల్ బంపర్ ప్రైజ్ మెర్సిడెస్ బెంజ్ ఎ క్లాస్ ని ఇచ్చారు. బెంజ్ కార్ గెలిచిన విన్నర్స్ సత్నం కౌర్, సాయికిరణ్ లకు బాలకృష్ణ భార్య నందమూరి వసుంధర చేతుల మీదుగా ఈ కార్ కీస్ ని అందించారు.

Also Read : Srikanth : రీహాబిలిటేషన్ సెంటర్ పేషేంట్స్ ని పరామర్శించిన శ్రీకాంత్..

ఈ కార్యక్రమంలో FNCC సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగరావు, సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ జుజాల, బాలరాజు, గోపాల రావు, ఏడిద రాజా, మోహన్ వడ్లపట్ల, సామ ఇంద్రపాల్ రెడ్డి.. పలువురు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ చేసిన నవనామి – మెగాలియో, DSR బిల్డర్స్ & డెవలపర్స్, సన్ షైన్ డెవలపర్స్, మెర్సిడెస్ బెంజ్ సిల్వర్ స్టార్, శ్రీ మిత్ర టౌన్షిప్స్, కిమ్స్ హాస్పిటల్స్, ప్రజ్ఞ హాస్పిటల్స్, NNL ఇన్ఫ్రాటెక్, హర్ష ఆటో, మందిర్, ప్రకృతి ఎవెన్యూస్, వంశీరాం బిల్డర్స్.. పలువురు పాల్గొన్నారు.

FNCC సెక్రటరీ ముళ్లపూడి మోహన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాము. ఇకపై కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ FNCCని ఇండియాలోనే నెంబర్ వన్ క్లబ్ గా తీర్చిదిద్దుతాం. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన వారికి, స్పాన్సర్స్ కి ధన్యవాదాలు. పిలవగానే వచ్చి సపోర్ట్ చేసిన నందమూరి వసుంధర గారికి కృతజ్ఞతలు అని తెలిపారు.