Miss India : మిస్ ఇండియా 2023గా రాజస్థాన్ అమ్మాయి నందిని గుప్తా..

ఈ సారి ఫెమినా మిస్ ఇండియా 2023 విన్నర్ గా ఆ 30 మంది సుందరీమణుల నుంచి రాజస్థాన్ కి చెందిన 19 ఏళ్ళ నందిని గుప్తా ఎంపికైంది. 59వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని నందిని గుప్తా అందుకుంది.

Miss India : మిస్ ఇండియా 2023గా రాజస్థాన్ అమ్మాయి నందిని గుప్తా..

Nandini Gupta crowned Femina Miss India 2023

Updated On : April 16, 2023 / 5:01 PM IST

Miss India :  59వ ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీలు శనివారం (ఏప్రిల్ 15న) మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ మిస్ ఇండియాలు, ప్రముఖ బాలీవుడ్ నటీనటులు విచ్చేశారు. ఫైనల్ కి వచ్చిన టాప్ 30 కంటెస్టెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని 30 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు ఫైనల్ కి వచ్చారు. ఆ 30 మంది కంటెస్టెంట్స్ ఫైనల్ లో తమ అందం, అభినయంతో మెప్పించారు.

ఈ సారి ఫెమినా మిస్ ఇండియా 2023 విన్నర్ గా ఆ 30 మంది సుందరీమణుల నుంచి రాజస్థాన్ కి చెందిన 19 ఏళ్ళ నందిని గుప్తా ఎంపికైంది. 59వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని నందిని గుప్తా అందుకుంది. గతేడాది మిస్ ఇండియాగా నిలిచినా సినీ శెట్టి కిరీటాన్ని నందిని గుప్తాకి అలంకరించింది. ఇక మొదటి రన్నరప్ గా ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా, రెండో రన్నరప్ గా మణిపూర్ కి చెందిన తౌనోజమ్‌ స్ట్రెలా లువాంగ్‌ లు నిలిచారు.

Image

Agent Movie : ఏజెంట్ సినిమాను కొనడానికి ఎవ్వరూ రావట్లేదా? నిర్మాత అనిల్ సుంకర కామెంట్స్..

ఈ ఏడాది మిస్ ఇండియా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి గోమతి, తెలంగాణ నుంచి ఊర్మిళ చౌహన్ లు ఫైనల్ వరకు వెళ్లారు. ఇక విన్నర్స్ ని కార్యక్రమానికి విచ్చేసిన కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, పలువురు ప్రముఖులు అభినందించారు. నందిని గుప్తాకు దేశవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి. మిస్ వరల్డ్ పోటీల్లో ఈమె భారత్ తరపున ప్రాతినిధ్యం వహించబోతుంది.