Nandini Rai : కౌశల్‌ని మంచిగా చూపించి మమ్మల్ని బ్యాడ్ చేసారు.. వాళ్ళకి టీఆర్పీ కావాలి.. బిగ్ బాస్ 2 పై సంచలన వ్యాఖ్యలు..

తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న నటి నందిని రాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బిగ్ బాస్ గురించి మాట్లాడింది.

Nandini Rai Sensational Comments on Bigg Boss Season 2 and Kaushal Manda

Nandini Rai : బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ తో పాటు వివాదాలు కూడా ఉంటాయి. కంటెస్టెంట్స్ ఒకరినొకరు విమర్శించుకోవడం, బయట వాళ్ళ అభిమానులు వేరే కంటెస్టెంట్స్ ని ట్రోలింగ్స్ చేయడం జరుగుతూనే ఉంటాయి. కానీ అన్ని సీజన్స్ కంటే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 2 బాగా వివాదాస్పదం అయింది. షోలో గొడవలే కాకుండా బయట కౌశల్ ఆర్మీ అని అతని మనుషులు అందరి కంటెస్టెంట్స్ మీద, నాని మీద తీవ్రంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న నటి నందిని రాయ్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బిగ్ బాస్ గురించి మాట్లాడింది.

Also Read : Nandini Rai : గోవాలో చేతబడి.. రెండేళ్లు డిప్రెషన్ లోనే ఉన్నాను.. హెల్త్ సమస్యలు.. బిగ్ బాస్ భామ ఎమోషనల్..

నందిని రాయ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ కి అక్కడ హౌస్ లో సోలోగా ఉండొచ్చు అని వెళ్ళాను. అప్పుడు నేను డిప్రెషన్ ఫేజ్ లో ఉన్నాను. దాంతో కొత్తగా ఉంటుంది, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు అని వెళ్ళాను. బయటకు వచ్చాక మంచి ఫేమ్ వచ్చింది. కానీ టీవీ వాళ్ళు వాళ్లకు ఎవరు టీఆర్పీ తెస్తే వాళ్ళని మంచిగా చూపిస్తారు. కౌశల్ వాళ్లకు టీఆర్పీ తెచ్చాడు కాబట్టి అతన్ని మంచిగా చూపించి మమ్మల్ని బ్యాడ్ గా చూపించారు. లోపల చాలా జరుగుతాయి. కానీ అది ఎడిట్ చేసి ఛానల్ కొంతమంది గురించే గుడ్ చూపిస్తుంది. మిగిలిన వాళ్లను నెగిటివ్ గా చూపిస్తారు. ఛానల్ తన బిజినెస్ చూసుకుంటుంది. నాని గారిని కూడా ట్రోల్ చేసారు. బయటకు వచ్చి అన్ని ఎపిసోడ్స్ చూస్తే మేము మాట్లాడినవి మంచివి చాలా కట్ చేసారు. కానీ బిగ్ బాస్ వల్ల ఫేమ్ వచ్చి సినిమాలు, సిరీస్ లు ఆఫర్స్ వచ్చాయి అని తెలిపింది.

Also Read : Dil Raju : పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు.. థియేటర్స్ లో ఫుడ్ ధరలు అందుబాటులోకి.. దిల్ రాజు లెటర్ వైరల్..