విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని

మనం, 24, ఇష్క్ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ కాంబోలో నేచురల్ స్టార్ నాని మూవీ అంటే ఖచ్చితంగా ఆసక్తి రేపేదే. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు నాని. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ సినిమాలో నటిస్తున్న నాని తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఈ రెండు సినిమాల రిలీజ్‌కు ముందే మరో సినిమాను కూడా ఫైనల్ చేశారు నాని. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మెహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు నాని.
Read Also : ‘లక్ష్మీస్ ఎన్‌టీఆర్’ విడుదల వాయిదా: ప్రకటించిన వర్మ
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నానికి జోడిగా అదితి రావ్ హైదరిని హీరోయిన్‌గా తీసుకున్నారట. గత చిత్రం సమ్మెహనంలో హీరోయిన్‌గా నటించిన అదితిని ఈ సినిమాలో తీసుకునే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు ఇంద్రగంటి. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు కీలక పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. నాని పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ను గ్యాంగ్ లీడర్ గా ప్రకటించారు నిర్మాతలు.
నాని ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. గతంలోనే ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నారు .. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. బన్నీతో చేయవలసిన ప్రాజెక్టు వాయిదా పడటంతో, అంతకు ముందు నానితో అనుకున్న సినిమా చేయడానికి విక్రమ్ కుమార్ రెడీ అవుతున్నాడు. అశ్వనీదత్ బ్యానర్లో ఈ సినిమా ఉండొచ్చుననే టాక్ వినిపిస్తోంది.
Read Also : శ్రీ దేవి బయోపిక్ లో బాలీవుడ్ హీరోయిన్!