R Narayana Murthy : అభిమానుల్లారా ఆందోళన వద్దు.. ఆరోగ్యంగానే ఉన్నా : ఆర్ నారాయణమూర్తి

తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని నారాయణ మూర్తి తెలిపారు.

R Narayana Murthy : అభిమానుల్లారా ఆందోళన వద్దు.. ఆరోగ్యంగానే ఉన్నా : ఆర్ నారాయణమూర్తి

Narayana Murthy clarity on his health

Updated On : July 17, 2024 / 7:02 PM IST

పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరిన‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న హైద‌రాబాద్‌లోని నిమ్స్ హాస్పిట‌ల్‌లో చేరిన‌ట్లుగా తెలుస్తోంది. అక్క‌డ డాక్ట‌ర్ బీర‌ప్ప ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీంతో ఆయ‌న‌కు ఏమైందోన‌ని ఆయ‌న అభిమానులు కంగారు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని నారాయణ మూర్తి తెలిపారు.

త‌న ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్ర‌స్తుతం తాను నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న‌ట్లుగా చెప్పారు. దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్న‌ట్లు వెల్ల‌డించాడు. పూర్తిగా కోలుకున్న త‌రువాత అన్ని వివ‌రాల‌ను వెల్ల‌డిస్తాన‌ని నారాయ‌ణ మూర్తి ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

Naveen Polishetty : పాపం గాయాలతో నవీన్ పోలిశెట్టి.. త్వరలో తిరిగొస్తాను అంటూ..